ఇద్దరమ్మాయిలతో.. సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నా హీరో అల్లు అర్జున్. ఈ సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చిత్రం గురించి అనేక విశేషాలు చెప్పారు. పూరీ జగన్నాథ్ సినిమాల్లో సహజంగా స్ర్కీన్ ప్లే కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ సినిమాలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అర్జున్ చెప్పారు.  ఈ సినిమాలో ఆకట్టుకునే డైలాగ్స్ అనేకం ఉన్నాయని ఈ మెగా హీరో చెప్పాడు. ‘గబ్బర్ సింగ్’, ‘బాద్ షా’ ల తరువాత నిర్మాత బండ్ల గణేష్  ఈ సినిమాతో హ్యట్రిక్ సాధించడం ఖాయమని చెప్పారు.


అలాగే మిగిలిన హీరోలో పోల్చుకుంటే తాము చాలా అదృష్టవంతులమని ఈ మెగా హీరో చెప్పాడు. మిగిలిన హీరోలు తమ సినిమాలకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారని, అయితే మెగా అభిమానుల అండతో తమకు ఆ బాధ లేదని అల్లు అర్జున్ వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ మెగాస్టార్ లా అవ్వాలని కోరుకుంటారని తానూ కూడా అందుకు మినహాయింపు కాదని అల్లు అర్జున్ తెలిపాడు.

అలాగే చిన్నపిల్లలకు కూడా మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్యక్రమాల గురించి తెలుసని తాను కూడా చిరంజీవి బాటలో ప్రజాసేవ చేస్తానని అల్లు అర్జున్ వెల్లడించాడు. దీనిపై ఇప్పటికే కొంత అద్యయనం చేశామని, పూర్తిగా అద్యయనం అయిన తరువాత అన్ని వివరాలను వెల్లడిస్తామని అల్లు అర్జున్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: