అవకాశం ఏవరికైనా ఒకే ఒకసారి తలుపు తడుతుంది. ఆ అవకాశమే అదృష్టంగా మారుతుంది. ఆ అదృష్టాన్ని గుర్తించలేక ఇంటి గడప దాకా వచ్చిన అదృష్టలక్ష్మి ని వదులుకుంటూ ఉంటారు. తరువాత వదులుకున్న ఆ అదృష్టలక్ష్మి గురించి ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఈ విషయం మన ఫిల్మ్ సెలబ్రిటీలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా స్క్రిప్ట్ రాసుకొని అక్కడ నుండి సెట్స్ పైకి వెళ్ళేలోగా ఆ సినిమాలలో నటించే నటీనటుల విషయంలో చివరవరకూ మార్పులూ చేర్పులూ జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పులు ఒకరి అదృష్టాన్ని మరొకరికి ట్రాన్సఫర్ అవుతూ అప్పటిదాకా మామూలు తారలుగా ఉన్న నటినటులను సెలబ్రిటీలుగా మార్చేస్తూ ఉంటుంది.

ప్రిన్స్ మహేష్ బాబు ను టాలీవుడ్ ప్రిన్స్ గా మార్చేసిన పోకిరి సినిమా కధను పూరి జగన్నాద్ రవితేజ ను దృష్టిలో పెట్టుకొని రాశాడట. ఆ సినిమా టైటిల్ కూడా పూరి రవితేజ ను దృష్టిలో పెట్టుకొని “ఉత్తమ్ సింగ్ సన్ అఫ్ సూర్య నారాయణ” అనే పేరుతో ప్లాన్ చేస్తే అది రకరకాలుగా చేతులు మారి పూరి – మహేష్ ల బ్లాక్ బస్టర్ పోకిరి గా మారింది. ఆ సినిమాలో హీరోయిన్ గా మొదట పార్వతీ మెల్టన్ ను అనుకుంటే చివరకు పార్వతీ బదులు ఇలియానా చేరింది.  అదేవిధంగా అనుష్క కెరియర్ ను ఒక్క మలుపు తిప్పిన అరుంధతి లోని జేజెమ్మ పాత్రకు మమతామోహన్ దాస్ ను అనుకుంటే ఆమెకు అనారోగ్యం వల్ల జేజెమ్మ పాత్ర అనుష్క ఇంట వాలింది. రజినీకాంత్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చంద్రముఖి సినిమాలో మొదటగా జ్యోతిక పాత్రను సిమ్రాన్ చేత చెయిద్దామని అనుకుంటే సిమ్రాన్ గర్భవతి అని తెలియడంతో సిమ్రాన్ అదృష్టం జ్యోతికను వరించింది. అంతఎందుకు ఈ ఏడాది విడుదల అయిన సినిమాలలో బ్లాక్ బస్టర్ గా మిగిలిన “గుండేజారి గల్లంతైందే” సినిమా కధను ఆ సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండ అనేకమంది హీరోలకు వినిపించినా నచ్చకపోవడంతో ఆ కధ నితిన్ కు సూపర్ అదృష్టాన్ని కలిగించింది.

ఇలా మన టాలీవుడ్ సినిమా రంగంలో ఒకరి అదృష్టం మరొకరికి మ్యూజికల్ చైర్స్ లా మారిపోతూ, అప్పటిదాకా తారలుగా ఉన్నవాళ్ళు సూపర్ స్టార్స్ గా మారిపోయే అదృష్టాన్ని కలగజేసింది. అందుకే కాబోలు అదృష్టం అంటే మనకు కనబడనది అంటారు. ఏ రంగంలో  అయినా ఆ అదృష్టాన్ని గుర్తించిన వాడే సెలబ్రిటీ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: