ప్రిన్స్ మహేష్ బాబు - దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘పోకిరి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు కొందరికే తెలుసు. ఈ సినిమాకు ‘పోకిరి’ అనే టైటిల్ కాకుండా పూరీ జగన్నాథ్ ముందుగా ‘ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ’ అనే టైటిల్ ను అనుకున్నాడు. అలాగే ఈ సినిమాను రవితేజ హీరోగా రూపొందించాలని అనుకున్నాడు. అయితే ఈ కథ మహేష్ బాబు దగ్గరకు వెళ్లడం, ఆయనకు నచ్చడంతో సినిమా ‘పోకిరి’గా మారింది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పార్వతిమెల్టన్ ను అనుకున్నారు. చివరికి ఇలియానా ఎన్నికయ్యింది. సంచలనం విజయం సాధించిన ‘పోకిరి’కి ఇంత కథ ఉంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: