సింహా కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ అవుతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. ఈ చిత్రానికి రూల‌ర్ అనే పేరు ప‌రిశీలించారు. అయితే ఆ టైటిల్ కె.ఎస్‌.రామారావు ద‌గ్గ‌ర ఉంది. అందుకే బాల‌య్య సినిమాకి జ‌య సింహా అనే టైటిల్ పెట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ బాల‌య్య టైటిల్ అది కూడా కాద‌ట‌. 99 %

త‌న సినిమాకి టైటిల్ రూల‌ర్‌... అని బోయ‌పాటి శ్రీ‌ను చాలా కాన్పిడెన్స్‌గా చెబుతున్నాడు.లేని ప‌క్షంలో మ‌రో కొత్త టైటిల్ ఎంచుకొంటాను గానీ... సింహాని గుర్తుచేసేలా టైటిల్ ఉండ‌ద‌ని భ‌రోసా ఇస్తున్నాడు. మ‌రి ఆ కొత్త టైటిల్ ఏమిటో మ‌రి!  ఈ సినిమా జూన్ రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: