హీరోల‌కే రాజు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌...పండ్లలో రాజు మామాడిపండు...అదే ప‌వ‌న్ తోట‌లో పండే మామిడి పండు మామిడి ప‌ళ్లకే రారాజు.. ప‌వ‌న్ తోట‌లోని మామిడిప‌ళ్ల గురించి ఇండ‌స్ట్రీలో చాలా గొప్పగా చెబుతారు. రుచిలోగాని, రంగులోగాని వీటిని కొట్టిన మామిడిపళ్లు దేశంలోనే ఉండ‌వ‌ని ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు గొప్పగా చెబుతారు. ఏదేమైనా, ప‌వ‌న్ తోట‌లో పండే ప‌ళ్లంటే ఎంద‌రో సినీ ప్రముఖులు క్రేజ్ చూపిస్తారు..

వెల్‌,మొన్నేమో అన్న చిరంజీవికు మామిడి పండ్లను గిప్ట్‌గా ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఇప్పుడు మ‌రో లేడికు మ్యాంగో గిప్ట్ పంపాడు. త‌నెవ‌రో కాదు. ప‌వ‌ర్‌స్టార్ న‌టించిన పంజా మూవీకు ప్రొడ్యూజ‌ర్ త‌ను. పంజా మూవీ ప్రొడ్యూజ‌ర్ నీలిమ‌ తిరుమ‌లశెట్టికు త‌న తోట‌లోని మ్యాంగోల‌ను గిప్ట్‌గా పంపాడు. మొద‌టి మ్యాంగో గిప్ట్ చిరంజీవి అందుకున్నాక, ప‌వ‌నక‌ళ్యాణ్ త‌న స‌న్నిహితులకు ఈ మ్యాంగో గిప్ట్‌ను పంపుతున్నాడు.

అభిమానుల్లో సైతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పంపుతున్న మ్యాంగో గిప్ట్‌పై ఆశ‌క్తి రేకెత్తిస్తుంది. త‌నకు న‌చ్చిన వారికి ఈ మ్యాంగోల‌ను పంపుతున్న నేప‌ధ్యంలో, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌న్నిహిత అభిమానులు సైతం 'మ్యాంగో కొరిమ‌ర్' వ‌స్తుందేమో అని ఆశ‌గా చూస్తున్నారంట‌. 'ఒక వేశ అలా వస్తే, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పంపిన మామిడికాయ క‌దా, ఒక్కరే తిన‌కుండా ముక్కలు కోసి ప్రసాదంలా అంద‌రికి పంచండి..ప‌వ‌న్ అభిమానం రుచేంటో చూడండి' అంటున్నారు స‌ర‌దాగా.

మరింత సమాచారం తెలుసుకోండి: