ఇపుడు ఇటు ఇండ‌స్ట్ట్రీ, , అటు అభిమానుల్ని చ‌కోర ప‌క్షుల్లా ఎదురుచూసేలా చేస్తోన్న చిత్రం అత్తారింటికీ దారి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేష‌న్ లో రూపొందిన ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే ఇపుడు ఈ సినిమాకు సంబందించిన డైలాగ్స్ నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బేసిగ్గా డైలాగ్స్ తోనే సినిమాను బంప‌ర్ హిట్ చేయ‌గ‌ల త్రివిక్రమ్, ఏ డైలాగ్ ..ఏ వే ఆఫ్ స్టైల్లో చెప్పినా అభిమానుల చ‌ప్పట్లతో ధియేట‌ర్లు హోరెత్తెలా చేయ‌గ‌ల ప‌వ‌న్ తో ఈ సినిమాలో అదిరిపోయే డైలాగ్స్ చెప్పించాడ‌ట‌.
జ‌ల్సాలో అబ్బాయిని ఓ అమ్మాయి ఓర చూపుతో ఎలా ప‌డేయోచ్చో ఇలియానాకు కామెడీగా, స్టైలిష్ గా చెప్పిన ప‌వ‌న్ ఈ సినిమాలో స‌మంత‌తో చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ని త‌న వే స్టైల్ లో చెప్పి మెస్మరైజ్ చేయ‌బోతున్నాడ‌ట‌. దానికి సంబంధించి కొ్ని డైలాగ్స్ నెట్ లోకి వ‌చ్చాయి.. అవేంటంటే...

స‌మంత‌; ననువ్వు చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావ్...?
ప‌వ‌న్; చూడు జాను......స్వార్ధంగా ఆలోచించ‌డం మ‌న‌కు స్కూల్ డేస్ నుండే అల‌వాటు చేశారు. అశోకుడు రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటించెను ..నాటించెను అని చెప్తారుగానీ....చెట్ల మ‌ద్య వున్న రోడ్డును బ్రిటిషోడు బాగుచేశాడు అని ఏ బుక్ లోనైనా చెప్పారా. లేదు. మనం చ‌దివిన పాఠాలు జ్ఞనాన్ని ఇవ్వలేదు. అస‌లు మ‌నిషి......మ‌న‌స్తత్వం....దేశ‌భ‌క్తి....నిజాలు..అవాస్తవాలు నే చెప్తా నువ్వు విను.

డైలాగ్ వింటుంటే కొత్తగా అనిపిస్తుందిక‌దా..? మరి మూవీ ఇంకెంత స‌రికొత్తగా వుంటుందో......ఇలాంటి డైలాగ్స్ ప‌వ‌న్ తో ఇంకా ఎన్ని చెప్పించాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: