తండ్రి టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్. భారీ సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తాత టాలీవుడ్ రంగాన్ని కొన్ని దశాబ్దాలు ఏలిన ప్రముఖ హాస్యనటుడు. ఈ పాటికి ఈ వార్త రాస్తున్నది ఎవరి గురించో అర్ధం అయి పోయివుంటుంది. అతడే నేటి యువతరం చేత స్టైలిష్ స్టార్ గా పిలిపించుకుంటున్న అల్లు అర్జున్. బన్నీని చూడగానే అంతా బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని అనుకుంటాం.

కాని అల్లు అర్జున్ ది మాత్రం ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ అట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ అతని భార్య స్నేహ రెడ్డి. చిన్నప్పుడు అల్లు అర్జున్ చాలా సాధారణమైన జీవితం గడిపెవాడని, అంతేకాదు సైకిల్ మీద వెళ్ళి ఉదయాన్నే పాలు తీసుకువచ్చే వాడని, అల్లు అర్జున్ ఇంట్లో ఎవరిపనులు వారే చేసుకొనే వారని, ఈ విషయాలన్నీ చెపుతూ, స్నేహ తన భర్త గురించి మరో విషయం కూడా చెప్పింది. తన భర్త బన్నీ కి మధ్య తరగతి కష్టాలు అన్నీ తెలుసని,ఇప్పటికీ 500 నోటును తదేకంగా మన స్టైలిష్ స్టార్ చూస్తే కన్నీళ్ళు వస్తాయని చెపుతోంది. అయితే బన్నీ మాత్రం పీనాసి కాడు, డబ్బు విలువ తెలిసిన వాడు. అంటోంది స్నేహ రెడ్డి.

ఇప్పటికీ వందల కోట్లు గణించిన చిరంజీవి కూడా షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ కాస్ట్ చూసి అలోచించి కొంటారు అట. అటు మేనమామ ఇటు తండ్రి వారసత్వ లక్షణాలు డబ్బు విషయంపై వచ్చాయి కాబట్టే బన్నీ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తోంది అని అనుకోవాలి. విలువ తెలిసిన చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుందని అంటారు ఇందుకే కాబోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: