మ‌ధు....పేరులో వున్న మాధుర్యం ఆమె పాట‌లో వినిపిస్తుంటుంది. మెలోడి, ఫాస్ట్, ఫోక్, పాప్ ... సాంగ్ ఏదైనా ఆమె నోటి వెంట వ‌స్తే కెవ్వు కేక అనాల్సిందే. అలా కేక పెట్టించే మధు పాట తెలుగు ప్రేక్షకుల‌కు కొత్తే అయి వుండ‌వ‌చ్చు. కానీ అమెరికన్ సిటిజ‌న్స్ కి మాత్రం చాలా బాగా తెలుసు. నిత్యం పాప్ గీతాల‌లో ఊగిపోయే అమెరిక‌న్స్ ని మ‌రింత ఊగిపోయేలా చేసిన మ‌ధు మ‌న తెలుగు అమ్మాయే. అంద‌మైన గాత్రంతో పాటు కుర్రకారుకి కిర్రెక్కించే అందం మ‌ధు సొంతం.
హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని బ్యూటీని సొంతం చేసుకున్న మ‌ధు సింగ‌ర్ అవ్వడం వెనుక చాలా కృషి వుంది.
మూడేళ్ల ప్రాయం నుండే సరిగ‌మ‌లు నేర్చి...గ‌మ‌కాలతో గంతులేస్తూ పెరిగిన మ‌దూ 16ఏళ్లు వ‌చ్చేస‌రికీ లైవ్ షోస్ ఇవ్వడం మొద‌లు పెట్టారు. అమెరికాలో వెస్ర్టన్ వోక‌ల్ ట్రైనింగ్ మూడేళ్లు తీసుకున్న మ‌ధు 2008 నుండి 2011 వ‌ర‌కు 100 లైవ్ షోస్ తో పాప్ ప్రియుల‌ను ఓ ఊపు ఊపేశారు . అంతేకాదు 2011లో ఓ ఆల్బమ్ రూపొందిస్తే అది కూడా సూప‌ర్ హిట్. విశేషం ఏంటంటే ఈ ఆల్బమ్ లో మ‌ధు స్టెప్స్ తోనూ ఔరా అనిపించారు. ఇపుడు మ‌ధు మ‌రో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు దేశీ గర్ల్ ఆల్బమ్ తో రాబోతున్నారు.

దాదాపు 50 ల‌క్షల రూపాయ‌ల‌తో రూపొందిన ఈ వీడియా అండ్ ఆడియో ఆల్బమ్ ఈ రోజు రాత్రి 7గంట‌ల‌కు తాజ్ డెక్కన్ లో రిలీజ్ కానుంది . సినీ ప్రముఖుల మ‌ద్య విడుద‌ల కానున్న ఈ ఆల్బమ్ గురించి గ‌త రెండు రోజులుగా వెబ్ సైట్స్ అండ్ చాన‌ల్స్ బాగా క‌వ‌ర్ చేస్తున్నాయి. ఇక తెలుగులో పాప్ అంటే స్మిత‌నే గుర్తోస్తుంది. మ‌రి ఈ తెలుగ‌మ్మాయి ఆ స్మితను మ‌రిపించ‌గ‌ల సాంగ్స్ దేశీ గ‌ర్ల్ లో పాడిందో లేదో జ‌స్ట్ వెయిట్ అండ్ సీ....

మరింత సమాచారం తెలుసుకోండి: