పూరి ఏం చెప్పినా సినిమాటిక్ స్టైల్‌లో చెబుతారు. స్వ‌త‌హాగా మాట‌ల ర‌చ‌యిత క‌దా... ఆ డోసు వేరేలా ఉంటుంది. ఇద్ద‌ర మ్మాయిల‌తో బ‌న్నీ ఎలా చేశాడు?  అని అడిగితే కుమ్మి అవ‌త‌ల పారేశాడు... అన్నాడు. ఆయ‌న మీనింగు మంచిదే అయినా... నెగిటివ్‌గా ఆలోచించేవాళ్లూ ఉన్నారండీ. బ‌న్నీ ఎంత ఎదిగాడో చూడాలంటే ఈ సినిమాకి రండి.. అని చెబుతున్నారు. ఇది మాత్రం కాస్త ఓవ‌ర్‌గానే ఉంది.

ఈ సినిమాకి ఎంత బ్యాడ్ టాక్ వ‌చ్చినా.. గుడ్ గుడ్ అని చెప్పుకొంటోంది పూరి బృందం. ఈ ఫీల్ గుడ్ టాక్‌... సినిమా విడుద‌ల‌య్యాక ఉంటే సంతోష‌మే. అన్న‌ట్టు... ఈ సినిమా హెక్సా ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక జ‌రిగింది. దానికి కీల‌క‌మైన దేవిశ్రీ ప్ర‌సాద్ రాలేదు. సంగీత ద‌ర్శ‌కుడు లేకుండానే ప్లాటిన‌మ్ డిస్క్‌లు చేసేసుకొంటున్నాం... ఏమిటో ఈ సంస్కృతి??

మరింత సమాచారం తెలుసుకోండి: