శ్రీ‌శాంత్ పేరు స్పాట్ ఫిక్సింగ్‌లో ఎప్పుడైతే ఎక్కిందో.. అప్పుడే లక్ష్మీరాయ్ పేరు కూడా బాగా పాపుల‌ర్ అయిపోయింది. ఎందుకంటే అంతకు ముందు శ్రీ‌శాంత్‌తో రాసుకుపూసుకొని తిరిగింది ఈ అమ్మ‌డే. ఇద్ద‌రూ క‌లిసి  ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించారు. అప్పుడు తీసిన చిత్రాలు నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఆ ప్ర‌క‌ట‌న త‌ర‌వాత కూడా శ్రీ‌శాంత్‌, లక్ష్మీరాయ్‌లు ఇద్దరూబాగా క్లోజ్‌గా మెదిలార‌ని తెలిసింది. దానికి సంబంధించిన ఫొటోలు శ్రీ‌శాంత్ ల్యాప్ టాప్‌లో కూడా లభ్య‌మ‌య్యాయ‌ట‌. వాటి గురించి ఆరా తీస్తే.. ల‌క్ష్మీరాయ్ అగ్గిలం మీద గుగ్గిలం అయిపోతుంది.

స్పాట్ ఫిక్సింగ్ గురించి న‌న్ను అడుగుతారేంటి?  నేనేమైనా ఫిక్సింగ్ చేశానా? అప్పుడెప్పుడో శ్రీ‌శాంత్ తో ఓ యాడ్ చేశా. అంతే. అప్ప‌టితే మ‌ర్చిపోయా. నన్ను ఈ విష‌యంలో మ‌ళ్లీ కెల‌కొద్దు అని వార్నింగ్ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: