రోజుకో హీరోయిన్ వ‌స్తున్న ఈ రోజుల్లో వ‌రుస‌గా ఆఫ‌ర్లు అందుకోవ‌డం అంటే అంత ఈజీ కాదు. కానీ ద‌శాబ్దకాలంగా ఎంత‌మంది హీరోయిన్స్ వ‌చ్చినా అనుష్కకి ఏనాడు డిమాండ్ త‌గ్గలేదు. ప‌వ‌ర్ యోగాతో మేనిని మెరిసేలా చేసుకోవడం మ‌హాబాగా తెలిసిన అనుష్క ఏ టైంలో ఏ క‌ధలో నటిస్తే రిజ‌ల్ట్ ఎలా వుంటుందో కూడా బాగా ఎక్స్ పెక్ట్ చేయ‌గ‌ల‌దు. అందుకే ఇటు గ్లామ‌ర్ ,అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాప్ సీడ్ లో దూసుకుపోతూ వుంటుంది.
ప్రస్తుతం అనుష్క మూడు పెద్ద చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్షన్ లో వ‌ర్ణతో పాటు రాజ‌మౌళి బాహుబ‌లి, గుణ శేఖ‌ర్ రాణీ రుద్రమ్మ ..వేటిక‌వే ప్రత్యేక‌మైనవి. ఈ సినిమాల కోసం అనుష్క గుర్రపు స్వారితో పాటు క‌త్తిసాము కూడా నేర్చుకుంది. ఈ మూడు సినిమాలు బ‌య‌టికి వ‌స్తే అనుష్క రేంజ్ అమాంతం ఆకాశాన్ని తాకిన ఆశ్చర్యపోన‌క్కర్లేదు.

ఆ విష‌యం ప‌క్కన‌పెడితే..బాహుబలి రూపంలో అనుష్క డ‌బుల్ ఆఫ‌ర్ అందుకుంది. అదెలా అంటే బాహుబ‌లి క‌ధ మూడు గంట‌లు రావ‌డంతో బాహుబ‌లిని రెండు బాగాలుగా విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి ఆలోచిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ లెక్కన చూస్తే బాహుబ‌లి బ‌డ్జెట్ రెండు వంద‌ల కోట్లకు చేరుకుంటుంది. సో డ‌బుల్ ఆఫ‌ర్ తో రెండు వంద‌ల కోట్ల సినిమాలో న‌టించిన ఒన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా అనుష్క రికార్డ్ క్రియేట్ చేయ‌బోతుంది. సో అనుష్కానా మ‌జాకా....?

మరింత సమాచారం తెలుసుకోండి: