ప్రిన్స్ కి ఓ సెంటిమెంట్ వుంది. తండ్రి కృష్ణ పుట్టిన‌రోజున త‌న సినిమాల‌కి సంబందించిన ఏ పని చేసినా అది స‌క్సెస్ అవుతుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతాడు. గ‌తంలో దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల ఫ‌స్ట్ లుక్ కృష్ణ బ‌ర్త్ డే రోజునే విడుద‌ల చేశాడు. ఆ రెండు సినిమాలు సూప‌ర్ హిట్టైయ్యాయి.
అందుకే ఇపుడు సుకుమార్ డైరెక్షన్ లో న‌టిస్తున్న నేనొక్కడినే ఫ‌స్ట్ లుక్ కూడా ఇదే రోజు రిలీజ్ చేశాడు. ఈ రోజు మార్నింగ్ విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కి భీభ‌త్సమైన రెస్పాన్స్ వ‌స్తోంది. నెట్ లో ఈ సినిమా స్టిల్స్ ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్రిన్స్ ని ఎలా అయితే చూడాల‌నుకుంటున్నారో అచ్చు అలాగే వున్నాడంటున్నారు ఫ్యాన్స్. చీకట్లో బైక్ పై కూర్చోని కోపంగా చూస్తున్న ప్రిన్స్ ని చూస్తుంటే ఇది ప‌క్కా యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ అని చెప్పక‌నే చెప్పిన‌ట్టే అయింది.

డిఫ‌రెంట్ స్టోరితో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రిన్స్ మూడు రకాల పాత్రలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కి జోడిగా కొత్తమ్మాయి కృతిస‌న‌న్ న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రిలీజ్ డేట్ మూవీ యూనిట్ ఇప్పటికైతే స‌స్పెన్స్ లోనే పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: