“మీ మేని ఛాయ తెల్లగా మారి పోవాలా అయితే ఫలానా క్రీము వాడండి, అంటూ బోల్డన్ని ప్రకటనలను మనం చూస్తుంటాం . కానీ కత్రినాలా తెల్లగా ఉండేవాళ్ళు నల్లబడాలంటే  మాత్రం ఏ క్రీములు దొరకవు. ఈ మధ్యన సుందరాంగి నల్లబడటం కోసం ఏవైనా క్రీములున్నాయేమో తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు తిరగేసిందట. అంతేకాదు తెలిసినవాళ్లను కూడా దీని గురించి అడిగిందట, అయినా ఫలితం లేకుండా పోయిందట. ఇక క్రీములను నమ్ముకుంటే ఉపయోగం లేదని బీచ్ లను నమ్ముకున్నదట కత్రినా.
 చాలా ఎక్కువ ఎండగా ఉన్న సమయంలో ధాయ్ బీచ్ లలో గడిపారట. ఆ ఎండలతో కత్రినా మేని ఎండలకు కమిలిపోయి రంగు తగ్గిందట. ఈ కొత్త మేని ఛాయకు కత్రినా సంబరపడిపోతున్నదట కత్రినా. ఇదేమిటో తెల్లగా ఉన్నవాళ్ళు ఇలా నల్లబడాలనుకుంటున్నారా? లేక కత్రినాకు ఏమైనా పిచ్చా అనుకుంటున్నారా? సినిమా కోసమే కత్రినా నల్లబడిందట. ప్రస్తుతం ‘ధూమ్2’ లో ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాల్లో నటిస్తుందట.

ఈ రెండు చిత్రాల్లో విరోచితమైన పోరాటాలు చేస్తున్నారట.అందుకోసం ఆ పాత్రల పరంగా డిఫరెన్స్ చూపించాలనుకున్నారు ఆమె. ‘ధూమ్ 2’ లో తెల్లగా, ‘బ్యాంగ్ బ్యాంగ్’ లో తక్కువ రంగుతో కనిపిస్తే వ్యత్యాసం తెలుస్తుందని కత్రినా భావించిందట. అందుకోసమే ధాయ్ బీచ్ లను ఆశ్రయించారు. దీనినిబట్టి ఒక పాత్ర కోసం ఎలా అయినా మారడానికి కత్రినా సిద్దపడతారని అర్ధవుతుంది....  

మరింత సమాచారం తెలుసుకోండి: