న‌రేష్ మ‌రీ యూత్ అయిపోతున్నాడు. మ‌ళ్లీ అల్ల‌రి.... నాటి రోజులు గుర్తు చేస్తూ ట్రిమ్ గా త‌యార‌య్యాడు. అల్ల‌రి త‌ర‌వాత క్లీన్ షేవ్‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. ఎందుకంటే ఈసారి జట్టుక‌ట్టింది మ‌రో అల్ల‌రోడు... ర‌విబాబుతో క‌దా!  వీరిద్ద‌రి క‌లయిక‌లో ముచ్చ‌టగా మూడో సినిమా గురువారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. మ‌హారథి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది.

ఈ సినిమాలో చాలా కాలం తర‌వాత న‌రేష్ క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడ‌ట‌. అల్ల‌రి సినిమాకీ, ఈ సినిమాకీ ఏమాత్రం సంబంధం లేద‌ట‌. పూర్తిగా కొత్త క‌థ ఎంచుకొన్నార‌ట‌. కానీ న‌రేష్  గెట‌ప్ మాత్రం... అల్ల‌రి సినిమా చూస్తున్న‌ట్టే ఉంది. న‌రేష్ లోని కామెడీ హీరోని ఈ సినిమాలో కొత్త‌గా చూపిస్తార‌ట‌. క‌థానాయక ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: