సిని పరిశ్రమలో ఎంతో పేరున్న డైరెక్టర్ కదా అని వెల్లిన ప్రేక్షకులకు మరో ‘పూర్’ సినిమాను అందించారు పూరిజగన్నాథ్. పవర్ ఫుల్ డైలాగులుంటాయని పూరి పై నమ్మకంతో వెలితే చప్పటి డైలాగులతో ఉప్పుకారం లేని కూరతో పూరి తినిపించారు. ఒక్క హీరోయిన్ తో సినిమాను చక్కగా తీసే అవకాశమున్నా కూడా ఇద్దరు హీరోయిన్లను పెట్టి మరో హీరోయిన్ పాత్రను చెత్తచెత్త చేసారు. ఇదీ... పూరిజగన్నాథ్ వంటి గ్రేట్ డైరెక్టర్, స్టార్ హీరో ఉన్న అల్లు అర్జున్ ల ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా సీన్.

సినిమా మొదటి హాఫ్ బాగానే అనిపించింది, ఇంటర్వెల్ ఎటాక్ కూడా సూపర్ అన్న సస్పెన్స్ ను పుట్టించింది, ఆతర్వాత అంతా తుస్సు మనిపించింది. కథా బలం అంత ఎక్కువ లేకున్నా, చక్కటి డైరెక్షన్ తో సినిమాను హిట్టు చేసే అవకాశాలున్నా కూడా, పూరి జగన్నాథ్ తొందరపడి, సినిమాను ఎప్పుడు ముగించాలి అన్నట్టుగా వడివడిగా సినిమాను నడిపించి అంతా పాడు చేసారు.

హీరో కు హీరోయిన్ అమలాపాల్ తో ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్లి ఆతర్వాత సస్సెన్స్ క్రియేట్ చేసి, సెకండ్ హీరోయిన్ క్యాథరిన్ హీరో కు పరిచయం చేయడం, ఆమెకు హీరో పాత లవ్ స్టోరిని తెలిపాక, హీరో తో ప్రేమలో పడేసి సినిమాను కాస్థా రసవత్తర స్టేజికి తీసుకుపోయి, ఏంజరుగుతుందో అన్న టెన్షన్ ప్రేక్షకులకు కలిగించి, అంతలోనే దాని గాలి తీసారు. సెకండ్ హీరోయిన్ క్యాథరిన్ తో సినిమాకు సంబందం లేని సీన్లను చేయించి ఆమె పాత్ర అవసరం లేదని చెప్పేసారు. క్యాథరిన్ తండ్రిని విలన్ గా పెట్టి, ఆమెతో తండ్రితో సంబందం ఉన్న మరో డాన్ తో పెళ్లి కుదిర్చి అంతా ఆగమాగం చేసారు.

చక్కటి కమెడియన్ బ్రహ్మానందం ను పెట్టి ఆయనతో కూడా అడ్డమైన సీన్లు పెట్టారు. అలీని ఎంట్రీచేసి ఆయన పాత్రను ఉపయోగించుకోవాల్సింది పోయి మరింత చెడగొట్టుకున్నారు. చక్కటి పాటలు, సంగీతం, డ్యాన్స్, అక్కడక్కడా చక్కటి కామెడి, అదిరి పోయే ఫైట్స్ పెట్టడంతో ప్రేక్షకులు సినిమాకు ఎందుకు వచ్చాంరా బాబు అనుకోకుండా మాత్రం చేయగలిగారు. మొత్తం మీద ఓపికస్థులు మాత్రం ఒకసారి చూడగలిగే విదంగా ఇద్దరమ్మాయిలతో సినిమా ఉందనవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: