ప్రొడ్యూజ‌ర్లు డ‌బ్బులు ఎలా సంపాదించాలో బాగా ఆలోచింది, చివ‌రికి ఓ స‌రికొత్త టెక్నాల‌జీతో ముందుకు వ‌చ్చేస్తున్నారు. అదే 3D. ఇప్పుడు తెలుగులో 3D అంటే మోజుప‌డుతున్న హీరోలు ఉన్నారు. అందులోనే మూవీ తీయాల‌నే క‌సితో ఉన్న ద‌ర్శకులు ఉన్నారు. లాభాలు సంపాదించాల‌నే క‌సితో క‌ళ్ళు 3Dలా వాచి, ఏం చేయ‌బోతున్నారో అర్ధం కాక కాళ్ళు పప్పులో వేస్తున్నారు మ‌న ప్రొడ్యూజ‌ర్లు.


తెలుగులో వ‌స్తున్న క‌ళ్యాన్‌రామ్ ఓం3D, అల్లరిన‌రేష్ యాక్షన్ కామెడి3D, గుణ‌శేఖ‌ర్‌ రాణిరుద్రదేవి 3D, ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య కొచ్ఛాడ‌య‌న్ 3D మూవీలు, త్వర‌లో స్కీన్స్‌ను హిట్ చేయ‌బోతున్నని. తెలుగులో ఉన్న వేల కొల‌ది థియోట‌ర్లులో 3D మూవీకు స‌పోర్ట్ చేసే స్క్రీన్స్ కేవ‌లం 1600 మాత్రమే. అందులోనూ ఎ1 3D స్ర్క్రీన్స్ కేవ‌లం వంద‌లోపే ఉన్నాయి. మ‌రి వీళ్ళు ఇంత ఆత్రంగా తీస్తున్న మూవీల‌ను ప్రేక్షకులు 3Dలో ఎలా చూడ‌గ‌లుగుతారు..?

సాధార‌ణ ప్రేక్షకుడు 3D అనుకొని ఎదో ఒక థియోట‌ర్‌కు వెళితే, లేనిపోని ఎఫెక్ట్స్‌తో వాళ్ళను అధ‌ర‌గొట్టేస్తారు. దీంతో ప్రేక్షకుడు బెదిరిపోయి 3D రేంజ్‌లో తిట్టుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వ‌ర‌కూ ఇండియాలో రిలీజ్ అయిన అన్ని 3D ఫిల్మ్స్‌ లాభాల్లో రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదేనని విశ్లేకులు నెత్తి,నోరు బాదుకుంటున్నారు. అయినా ఈ 3D ఫార్మెట్‌ లాభాల పంట అనుకొని, క‌నీసం పెట్టిన డ‌బ్బులు కూడ రాబ‌ట్టుకోని ప్రొడ్యూజ‌ర్లు ఇప్పటికి ఉన్నారు.

ప్రస్తుతం ఈ 3D దెబ్బేంటో రుచి చూడ‌టానికి ర‌డీగా ఉన్న హీరో క‌ళ్యాణ్‌రామ్‌. త‌న మూవీను ఎలా మార్కెట్ చేసుకోవాలో అర్ధం కాక‌, 3Dతో అనుకున్న ఫార్మెట్ మొత్తానే తిర‌కాసును తెచ్చింది. ఆ త‌రువాత హీరో అల్లోరోడికి నిజంగా య‌క్షన్‌3D క‌న‌ప‌డుతుందంట‌. ఈ విధంగా ఎంత లాస్ అయినా ఈ 3D మోజు ముందున్న కాలంలో మ‌రింత పెరగ‌టం ఖాయం క‌నుక, ఎవ‌రైన ఇన్వెస్టర్లు ఈ హీరోలు,ద‌ర్శకులు,ప్రొడ్యూజ‌ర్ల కోసం వంద‌ల కొద్ది 3D స్క్రీన్స్ క‌ట్టి లీజ్‌ల‌కు ఇచ్చుకుంటే స‌రి. వాళ్ళు మోజు తీరిద్ది, మ‌న‌కు లాభ‌మూ మిగిలిద్ది.

మరింత సమాచారం తెలుసుకోండి: