ఈ రోజు ప్రిన్స్ టీజ‌ర్ రీలైజ్ అంతటా సునామి క్రియోట్ చేస్తుంటే ప్రిన్స్ మాత్రం సైలెంట్ అయిపోయాడు, దీనికి కార‌ణం, నేనొక్కడినే అంటూ రిలీజ్ అయిన టీజ‌ర్ లో టైటిల్ క‌న్‌ప్యూజ‌న్ ఏర్పడింది. సుకుమార్‌ ఏం చెప్పాల‌నుకుంటున్నాడో చెప్పలేక, ప్రేక్షకుల‌ను క‌న్‌ప్యూజ్ చేసాడా అని అంద‌రికి ఓ డౌట్ క్రియోట్ అయింది.

మ‌హేష్‌-సుకుమార్ మూవీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కక‌ ముందు నుండే మ‌హేష్ మూవీకు టైటిల్స్ హైప్ క్రియోట్ అయింది. దాంతో ఇష్టం వ‌చ్చిన పేర్లు ఇబ్బడి ముబ్బడిగా వ‌చ్చాయి. స‌రిగ్గా మూడు రోజుల క్రితం నేనొక్కడినే టైటిల్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. టీజ‌ర్ రిలీజ్ వ‌ర‌కూ నేనొక్కడినే టైటిల్ పై స‌రైన క్లారిటీనే రాలేదు. అంత‌లో మ‌రో పేరు ఒన్ అంటూ మ‌రో టైటిల్‌ స్ర్పెడ్ అయింది. ఫైన‌ల్‌గా మ‌హేస్ ఒన్‌ టైటిల్‌కు ఓకే చెప్పాడు. నేనొక్కడినే అనే టైటిల్ కూడ బాగుండ‌టంతో ఒన్ టైటిల్‌కు టాగ్‌లైన్ నేనొక్కడినే కూ అంద‌రూ ఓటు వేసారు.

కాని ఈ టీజ‌ర్ రీలీజ్ త‌రువాత ఒన్ అనేది చూడ‌టానికి త‌ప్పితే, పిలుచుకోవ‌డానికి నోచుకోలేదు. కింద ఉన్న టాగ్‌లైన్ టైటిల్ అయింది, మెయిన్ టైటిల్ సైలెంట్ అయింది. దీంతో మ‌హేష్ సార్ గ‌రం అయ్యార‌ని యూనిట్ చెప్పుకుంటుంది. క‌న్‌ప్యూజ‌న్‌లో పండుగాడిని క‌న్‌ప్యూజ్ చేసి, మొత్తానికి టైటిల్‌కు ఏ హైప్‌లేకుండా సో సోగా లాగించేసారు. ఈ టైటిల్ గోల అనేది సుకుమార్ ప్రతి మూవీకు ఉండేదే అని మ‌హేష్‌ను లైట్ తీసుకోమంటుంది ఇండ‌స్ట్రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: