టాలీవుడ్‌లో మరోసారి హాట్ హాట్ చర్చకు తెర తీశాడు ప్రిన్స్ మహేష్ బాబు.. ఇప్పుడు నేనే నంబర్ వన్ అంటున్నాడు. మహేష్ కొత్త సినిమా పేరుపై అనేక ఊహాగానాలు ప్రచారం జరిగిన తర్వాత వచ్చిన '1 నేనెక్కడినే' టైటిల్ టాలీవుడ్‌లో భారీ చర్చకు తెర లేపింది. తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరో ఎవరనే నెంబర్ గేమింగ్ ఈక్వేషన్లను మొదలుపెట్టింది.

మహేష్ విజయాల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాకా పేరు పెట్టారో.. లేక నిజంగా మూవీకి ఈ టైటిల్ అవసరమో కానీ.. ప్రిన్స్ కొత్త మూవీకి నెంబర్ వన్ అనే టైటిల్ పెట్టేశారు. నిజానికి పోకిరి తర్వాత నుంచి మహేష్ ను నంబర్ వన్ చేసేసిన అభిమానులు దూకుడు హిట్ తర్వాత ఈ మానియాను మరింత పెంచారు. కలెక్షన్స్, డైలాగ్స్, శాటిలైట్ హక్కుల అమ్మకం ఇలా మహేష్ సినిమాలకు ఏదో ఒక రూపంలో పదే పదే నెంబర్ వన్ అనే ట్యాగ్ లైన్ తగిలిస్తూనే ఉన్నారు.
��
ఈ మధ్య టాలీవుడ్ లో హీరోల మధ్య నంబర్ వన్ రేస్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఖాళీ అయిన స్థానం ఎవరిదంటూ చర్చ సాగుతూనే వుంది. వరస హిట్లతో మంచి స్వింగ్ లో ఉన్నాడు కాబట్టి మహేష్ బాబుదే ఆ స్థానమని చాలా ఫిక్సైపోయారు కూడా. దూకుడు, బిజినెస్ మేన్ తర్వాత ఈ ఈక్వేషన్స్ మరింత ఊపందుకొన్నాయ్. అయితే సినిమా చేయడం వరకే నా బాధ్యత. నెంబర్‌‌వన్‌పై ఆలోచన లేదని మహేష్‌ చాలాసార్లు చెప్పినప్పటికీ.. విశ్లేషణలు మాత్రం ఆగలేదు.

నెంబర్ గేమింగ్ పై నాకు ఆసక్తి లేదని ప్రిన్స్ చెబుతున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో అభిమానులు, సినిమాలు తీసే ప్రొడ్యూసర్ల హంగామా చూస్తే మహేష్ కూడా మొదటి స్థానంపై కన్నేశాడనిపిస్తోంది. అందుకే చాలా టైటిల్స్ పరిశీలించిన తర్వాత తాజా సినిమాకి నేనొక్కడినే నెంబర్ వన్ టైటిల్ పెట్టారని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. నంబర్ వన్ రేస్ లో లేము.. హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీని కాపాడటమే తమ లక్ష్యమని హీరోలు పైకి డైలాగ్ లు చెబుతున్నా.. అభిమానుల దృష్టిలో తామే A1 హీరో అనిపించుకోడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పంచ్ డైలాగ్ లు వదులుతూ తమ గురించి ప్రొజెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. మహేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా హిట్ హీరోలందరూ మూవీస్ లో తమ గొప్పలు చెప్పుకుంటున్న వారే. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ నంబర్ వన్ హీరో అనిపించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్న వారే.

ప్రస్తుతం టాప్ హీరోలుగా చలామణీలో ఉన్న హీరోల్లో కొందరు టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ అయినప్పటికీ జయాపజయాల పరంగా స్థిరమైన కెరీర్ గ్రాఫ్ ను కొనసాగించిన వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. అందరికీ సూపర్ హిట్లు ఉన్నాయి. సూపర్ ప్లాప్స్ ఉన్నాయి. సినిమా సినిమాకి హిట్ రేటు మారుతున్నప్పటికీ.. కెరీర్ మొత్తం గుర్తించుకో తగ్గ భారీ డిజాస్టర్ అందరూ హీరోలకు ఉంది. అందుకే నంబర్ వన్ హీరోగా పరిగణించాలంటే హిట్, ఫ్లాప్ కంటే ఫామ్ లో ఉండటమే ముఖ్యమనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: