బ‌న్ని చేతిలో పూరి గిటార్ పెట్టేశాడా అంటే ఏమో అంటున్నారు విశ్లేశ‌కులు. ఏ హీరోఅయినా పుల్ స్పీడ్‌లో వెళుతుంటే, ఆ హీరోతో నెక్ట్స్ మూవీలో పూరి ఉంటాడు. ఇక‌ అంతే.. ఆ మూవీ పై ఓవ‌ర్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఇట్టే పెరిగిపోతాయి. ఇంకేముంది, పూరీ త‌న‌దైన శైలిలో గోవా వెళ్ళి నాలుగు పంచ్ డైలాగులు రాసుకుంటాడు, సినిమా ర‌డీ అయిపోతుంది. మొత్తానికి మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్‌కు ఏమాత్రం డోకా లేకుండా ప్రొడ్యూజ‌ర్‌ను సేఫ్ జోన్‌లో ప‌డేయ‌టం పూరీ స్టైల్‌.

2012లో ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ గ‌బ్బర్‌సింగ్‌తో మాంచి దూకుడు మీద ఉన్నాడు, వెంట‌నే కెమెరామెన్ గంగ‌తో రాంబాబు అంటూ పూరి ఓ రండ‌న‌క .. అంటూ సో సో అన్నాడు. జులాయి మూవీతో అల్లుఅర్జున్ జోరు మీద ఉన్నాడు, ఇప్పుడు ఇద్దరమ్మాయిలు అంటూ పూరి సో సో అన్నాడు. 2011లో మ‌హేష్ దూకుడు మూవీతో బాక్సాపీస్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్ళిపోయాడు, వెంట‌నే 2012 లో బిజినెస్ మెన్ అంటూ పూరి సో సో అన్నాడు.

మొత్తంగా హీరో ఫాంలో ఉంటే ఆ నెక్ట్స్ మూవీకు హీరో వెన్నెంటే ఉంటాడు పూరి. మీడియా అండ్ నెట్ లో వ‌స్తున్న డివైడ్‌టాక్‌కు ఏ మాత్రం కొద్దిగా పైకి లేచినా, పూరి అంద‌రి దుమ్మును దుల‌ప‌టం ఖాయం అని టిటౌన్ అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: