ప‌వన్ క‌ల్యాణ్ సినిమాల‌తో క్రేజ్ సంపాదించుకొన్నాడు ర‌మ‌ణ గోగుల‌. ప‌వ‌న్ గోగుల నుంచి అంతా పిండుకొన్నాక‌... బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. లక్ష్మి త‌ప్ప బ‌య‌ట హీరోల‌తో ఒక్క హిట్టూ ఇవ్వ‌లేక‌పోయాడు. ఆ త‌ర‌వాత ప్రొడ్యూస‌ర్‌గానూ అవ‌తారం ఎత్తాడు. కొంత‌కాలం నుంచి ర‌మ‌ణ గోగుల జాడ తెలుగు ప‌రిశ్ర‌మ‌లో క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ ఇంత కాలానికి గోగుల గోల మొద‌లైంది.

తేజ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 1000 అబద్ధాలు సినిమాకి స్వ‌రాలు అందించాడు. అంతేకాదు.. ఓ పాట కూడా రాశాడు. ఇప్పుడు మ‌రో సినిమాని ప‌ట్టుకొన్నాడు. ఓవ‌ర్‌డోస్ సినిమాకి ప‌నిచేస్తున్నాడు. మ‌ళ్లీ ఫామ్‌లోకి రావ‌డానికి ఇలా నానా తంటాలూ ప‌డుతున్నాడు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు సంగీత ద‌ర్శ‌కుల కొర‌త ఉంది. దాన్ని క్యాష్ చేసుకొంటే ఇంకొంత కాలం.. ప‌రిశ్ర‌మ‌లో ర‌మ‌ణ పేరు వినిపిస్తుంది. అయితే కొత్త ట్యూన్స్ రావాలి క‌దా.. ఎప్ప‌ట్లా. హే... హే... అని అరిస్తే... పోహె... అన్నా అనొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: