తుంట‌రి, తుఫాన్‌, ఆచార్య‌, ది ప్రిన్స్, కొలంబ‌స్, నేనొక్క‌డినే.... ఇలా అర‌డ‌జ‌ను పేర్లు మహేష్‌బాబు చుట్టూ రౌండ‌ప్ చేసి క‌న్‌ఫ్యూజ్ చేశాయి. ఏది తేల్చుకోవాలో తెలీక‌... టీమ్ అంతా తిక‌మ‌క ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఓ టైటిల్ పై రాజ‌ముద్ర వేసేశాడు మ‌హేష్‌. అదే.. `వ‌న్‌`. నేనొక్క‌డినే అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది.

సుకుమార్ సినిమాల్లో... హీరోలంతా దాదాపు స్వార్థ ప‌రులే. ఈ సినిమాలోనూ మ‌హేష్ పాత్ర అలానే ఉంటుంద‌ట‌. నేనే చేయాలి, నేనొక్క‌డినే చేయాలి...  అనుకొంటాడ‌ట. పైగా నెంబ‌ర్ వ‌న్ కావాల‌ని క‌ల‌లు కంటాడ‌ట‌. అందుకే ఆ టైటిల్ ఒకే చేశార‌ని స‌మాచార‌మ్‌. ఫ‌స్ట్‌లుక్ ఇంకొన్ని గంట‌ల్లో బ‌య‌ట‌కు రానుంది. ఈ సినిమాలో మ‌హేష్ ఎలా ఉంటాడో..  అని అభిమానులంతా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్ష‌ణ‌కు మ‌రి కొన్ని గంట‌ల్లో తెర‌ప‌డ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: