నిజ జీవితంలో ఏమో గానీ.. కొత్తజంట సినిమాలో మాత్రం శిరీష్ స్వార్థ‌ప‌రుడే. శిరీష్ క‌థానాయకుడిగా న‌టిస్తున్న రెండో చిత్ర‌మిది. రెజీనా నాయిక‌. మారుతి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా గురువారం ఉద‌యం ప్రారంభ‌మైంది. గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫీష్ అనేది ఈ సినిమా క్యాప్ష‌న్‌.

జీవితంలో ఎద‌గ‌డానికి స్వార్థం కావాలి, కానీ స్వార్థ‌మే జీవితం కాకూడ‌దు అనే అంశం చుట్టూ తిరిగే క‌థ ఇద‌ట‌. నేను శిరీష్ లైఫ్‌ని ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించే ఈ క‌థ రాసుకొన్నా అంటున్నాడు ద‌ర్శ‌కుడు. అంటే శిరీష్ నిజ‌జీవితంలోనూ స్వార్థ ప‌రుడు అనే క‌దా??  తొలి సినిమాలో ఘెరంగా దొరికి పోయిన శిరీష్ ఈ సినిమా కోసం హార్డ్ వ‌ర్క్ బాగా చేశాడ‌ట‌. ముఖానికి కొన్నిరిపేర్లు కూడా జరిగాయ‌ట‌. ఆ మార్పు తెర‌పై ఎలా క‌నిపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: