నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న శుభ‌ఘ‌డియ వ‌చ్చేసింది. శ్రీ‌మ‌న్నారాయ‌ణ త‌ర‌వాత ఆయ‌న తొలి సారి మ‌ళ్లీ మేక‌ప్ వేసుకొంటున్నారు. 9 నెల‌ల సుదీర్ఘ విరామానికి స్వ‌స్తి చెబుతున్నాడు. రూల‌ర్ గా ముస్తాబ‌వుతున్నాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఒకే అయినా.. సెట్స్‌పైకి రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. బాల‌య్య రాజ‌కీయాలతో బిజీగా ఉండడం వ‌ల్ల‌.. ఈ సినిమాకి సమ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఖ‌రారు చేశారు.

జూన్ 3వ తారీఖున ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. జూన్ 10 బాల‌య్య జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. సంక్రాంతికి ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ సినిమా వ‌చ్చేయాల‌ని బాల‌య్య ఆర్డ‌రేశాట‌. ఇక షూటింగ్ చ‌క‌చ‌క జ‌రిగిపోవ‌డం ఖాయం. బాల‌య్య ప‌క్క‌న క‌థానాయిక ఎవ‌రు? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: