ప‌వ‌న్ క‌ల్యాణ్ పాట‌ల్ని, ఆయ‌న ఇమేజ్‌నీ వాడుకొంటున్న హీరో... నితిన్‌. మెగా ఫ్యామిలీ కూడా ప‌వ‌న్‌ని ఇంత‌లా వాడుకోలేదేమో..?  పవ‌న్‌ని ఇష్క్ ఆడియో వేడుక‌కు పిలిచిన ద‌గ్గ‌ర నుంచీ.. త‌న జాత‌కం మారిపోయింద‌ట‌. అందుకే ఇప్పటికీ ప‌వ‌న్ నామ జ‌పం చేస్తున్నాడు నితిన్‌. ఇప్పుడు లెటెస్టుగా ప‌వ‌న్ ద‌ర్శ‌కుడినీ వాడేసుకొంటున్నాడు.

ప‌వ‌న్ కల్యాణ్‌కి అత్యంత ప్రీతిపాత్ర‌డైన ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్‌. ఇప్పుడు ఆయ‌న‌తో జ‌ట్టు క‌ట్టాడు నితిన్‌. త‌న‌కు అచ్చమైన ప్రేమ క‌థ‌లే న‌ప్పుతాయ‌ని నితిన్ డిసైడ్ అయ్యాడ‌ట‌. అందుకే... క‌రుణాక‌ర‌న్‌ని ప‌ట్టేశాడు. క‌రుణాక‌ర‌న్‌-నితిన్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రావ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఇటీవ‌ల క‌రుణాక‌ర‌న్‌, నితిన్‌ల మ‌ధ్య క‌థా చర్చ‌లు జ‌రిగాయ‌ట‌. ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మించ‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: