మీలో టాలెంట్ ఉందా?  క‌థ‌లు రాస్తారా?  మీ ద‌గ్గ‌ర అదిరిపోయే క‌థ ఉందా?  డైరెక్ష‌న్ చేస్తారా?  అయితే చ‌లో గీతా ఆర్ట్స్‌. ఎందుకంటే మీలాంటి వాళ్ల కోస‌మే... అల్లు అర‌వింద్ ఎదురు చూస్తున్నార‌ట‌.  ''మంచి క‌థ‌తో వ‌స్తే, ద‌ర్శ‌క‌త్వం చేయ‌గల‌రు అనే న‌మ్మ‌కం ఉంటే మా సంస్థ మీ వెనుకే ఉంటుంది. మిమ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తాం. కొత్త ద‌ర్శ‌కులా? అనుభ‌వ‌జ్హులా అనే విష‌యం ప‌ట్టించుకోం. టాలెంట్ ఉన్న ఈత‌రాన్ని ప్రొత్స‌హించ‌డానికి గీతా ఆర్ట్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది..'' అని అర‌వింద్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేశారు.

సొంత స్టార్ల‌తోనే కాదు, బ‌య‌ట‌వారితోనూసినిమాలు చేయ‌డానికి అర‌వింద్ సిద్ధంగానే ఉన్నార‌ట‌. ఇవి కేవ‌లం మాట‌ల వ‌ర‌కేనా?  చేత‌ల్లోనూ చూపిస్తారా?  అనే విష‌యం ఎవ‌రికైనా ఓ అవ‌శం వ‌చ్చే వ‌ర‌కూ తెలీదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: