కుటుంబ క‌థా చిత్రాల‌కు, స్వ‌చ్ఛ‌మైన వినోదానికి కేరాఫ్‌గా నిలిచారు ఎస్‌.వి కృష్ణారెడ్డి. అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి క‌ల‌యిక అంటే క‌చ్చితంగా అది సూప‌ర్ ఎంట‌ర్‌టైన‌రే. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ సినిమా వ‌స్తోందిప్పుడు. ప్ర‌స్తుతం క‌థ రెడీగా ఉంది. దానికి సరితూగే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. అంతకు ముందు... కృష్ణారెడ్డి - సాయికుమార్ త‌న‌యుడు ఆది క‌ల‌యిక‌లో ఓ సినిమా రూపుద్దిద్దుకోనుంది. ఎప్పుడూ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌పైనే ఆధార‌ప‌డే కృష్ణారెడ్డి ఓ యూత్‌ఫుల్ క‌థ‌ను ఎంచుకొన్నాడ‌ట‌.

అనుభ‌వం, ప్ర‌తిభ క‌ల‌గ‌ల‌పిన కృష్ణారెడ్డి లాంటి వాళ్లు మ‌ళ్లీ... సినిమాల‌తో బిజీ అవ‌డం.. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు నిజంగా శుభ‌వార్తే.

మరింత సమాచారం తెలుసుకోండి: