నేను ఒక్కసారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టే...ర‌జనీకాంత్ నోట పేలిన ఈ డైలాగ్ బాషాను బాక్సాఫీస్ ద‌గ్గర బంప‌ర్ హిట్ గా నిలిపింది. అంతేకాదు ఈ సినిమాతోనే సూప‌ర్ స్టార్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీతోనే ర‌జనీ పంచ్ డైలాగ్స్ చెప్పడం మొద‌లైంది. ఆ డైలాగ్స్ కి ఫ్యాన్స్ అవ్వడం ఫిదా అవ్వడం స్టార్ట్ అయింది.
అప్పుడెప్పుడో 18ఏళ్ల క్రితం వ‌చ్చిన బాషా ..అందులోని డైలాగ్ గురించి ఇపుడు చ‌ర్చ ఏంట‌ని మీ డౌట్ క‌దా..? అయితే దానికో రీజ‌న్ వుంది. బాషాలో సూప‌ర్ స్టార్ ప‌లికిన ఆ డైలాగ్ ప‌క్కా కాపీ అంటూ ఇపుడు టాలీవుడ్ టు కోలీవుడ్ వార్తలు చ‌క్కర్లు కొడుతున్నాయి.

నిజానికి సూప‌ర్ స్టార్ త‌న‌దైన స్టైల్లో చెప్పి మెప్పించిన ఈ డైలాగ్ ఆ సినిమా ద‌ర్శకుడో, రైట‌రో రాసింది కాద‌ట‌. గ్రేట్ నావ‌లిస్ట్ జాన్ ఆస్టిన్ న‌వ‌ల నుండి కాపీ కొట్టార‌ని చెప్పే సాక్షాలు నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. . జాన్ ఆస్టిన్ రాసిన ఎమ్మా న‌వ‌ల‌లో ...if i have told you once, i have told you a 100 times డైలాగ్ ని తెలుగు, త‌మిళంలోకి త‌ర్జుమా చేసి యాజ్ టీజ్ వాడేశారని ఆ న‌వ‌ల‌లోని అక్షరాలు చూస్తే అర్ధమైపోతుంది ఎవ‌రికైనా. మ‌రి ఈ మ‌ద్యే ఈ సినిమాకు సంబందించి ఓ బుక్ కూడా రాసి రిలీజ్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ....ఈ కాపీ డైలాగ్ కు సంబందించి ఎలాంటి క‌ద అల్లి మ‌న‌కు చెప్పుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: