బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు చదువు రాదా..? ఇప్పుడు ఇదే విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. తనకు సంతకం చేయడం తప్ప.. అక్షరం ముక్క రాయడం రాదని సంజయ్ దత్ చెప్పాడట. 1993 బాంబు పేలుళ్ల కేసులో పుణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ స్టడీస్‌ విషయం ఇప్పుడు సడన్‌గా తెరపైకి వచ్చింది.

శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమకు కావాల్సిన వస్తువులు.. పేస్టులు, బ్రష్‌లు, సబ్బులు.. వంటి వాటిని రేషన్ కింద కొనుక్కోవచ్చు. వీటిలో తమకు ఏం కావాలో ఖైదీలు ఓ కాగితంపై రాసి జైలు సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఏవైనా వస్తువులు కావాలంటే పేపర్‌పై రాసివ్వాల్సిందిగా జైలు సిబ్బంది సంజయ్ ను కోరారు. దీంతో తన అసిస్టెంట్ రాసిస్తే సంతకం పెట్టడం తప్ప.. తనకు అక్షరం ముక్క కూడా రాదంటూ మున్నాభాయ్ చెప్పేశాడట. సంజూ సమాధానానికి జైలు సిబ్బంది ఆశ్చర్యపోయారంట. దీంతో సంజయ్‌ కు కావాల్సిన వస్తువులు మరో వ్యక్తితో రాయించుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి మున్నాభాయ్‌కు నిజంగానే రాయడం రాదా? లేక రాసి ఇవ్వడం చిన్నతనంగా భావించి అలా చెప్పాడో అర్థం కాక జైలు సిబ్బంది తికమక అవుతున్నారు.
 ��
సంజయ్‌దత్‌ చదువు రాదన్న విషయం జైలు సిబ్బందికే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకూ అనేక అనుమానాలు మొదలయ్యాయి. సంజయ్.. హిమాచల్‌ ప్రదేశ్‌ లోని సనావర్‌లో ఉన్న లారెన్స్ స్కూల్లో చదువుకున్నాడు. హైస్కూల్ రోజుల్లోనే డ్రగ్స్ కు బానిసయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అవడంతో చదువుకు గుడ్ బై చెప్పేశాడు. అయితే హైస్కూల్ వరకు చదువుకున్న మున్నాభాయ్.. తనకు అక్షరం ముక్క కూడా రాదనడం వెనుక అసలు కారణమేంటో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: