మండే వేసవిలో యంగ్ టైగర్ ఎన్టీర్, పవర్ స్టార్ పవన్ ల మధ్య నలిగిపోయిన సమంతకు తీరిక దొరికింది. రాకరాక దొరికిన తీరికను ఒక చేత్తో మామిడిపండు మరో చేత్తో టివి రిమోట్ పట్టకుని కుటుంబ సభ్యులతో చల్లబడ్డ వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది సమంత.

కొద్ది నెలలుగా విరామం అంటే ఏమిటో తెలియకుండా గడిపేసిన సమంత కు అనుకోకుండా దొరికిన ఈ విరామంతో ప్రాణం లేచి వచ్చింది అని చెపుతోంది సమంత. ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలకు బ్రేక్ దొరకడంతో సమంత కు అనుకోని తీరిక దొరికింది.

హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న సమంతను గుండె లేకుండా పవన్ కళ్యాణ్ ఈ నెల 5 తారీఖు నుండి బలవంతంగా యూరప్ సినిమా షూటింగ్ కు తీసుకు వెళ్లిపోతాడని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆయనను తిట్టుకుంటూ హాలీడేస్ ను గడుపుతోంది సమంత. ఈ షూటింగ్ అయిన తరువాత సమంత ను ఎన్టీర్ తన సినిమాకోసం కబ్జా చేస్తాడట. మరో ఆరు నెలలు దాకా తనకు విరామమే దొరకదు అని  గొణుక్కుంటూ చేసేది ఏమిలేక  దొరికిన విరామాన్ని గడుపుతోంది సమంత.... 

మరింత సమాచారం తెలుసుకోండి: