బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా అంటే ..అవున‌నే అంటున్నాయి బిటౌన్ వ‌ర్గాలు. అయితే ఈ ప్రేమికుడు మ‌న బాలీవుడ్ హీరోనో..లేక మ‌న‌దేశం వాడో కాదు. అమెరికాకు చెందినవాడు...ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ హీరో. పేరు జాన్ హ‌మ్. మ్యాడ్ మేన్ అనే హాలీవుడ్ సినిమా ఎవ‌రైనా చూసి వుంటే ఇత‌డిని మీకు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఇత‌డే హీరో.
ఈ హాలీవుడ్ హీరోనే మ‌న బాలీవుడ్ బేబీ ప్రియాంక చోప్రా పిచ్చ పిచ్చగా ప్రేమిస్తోంది. అత‌గాడు కూడా ప్రేమిస్తున్నాడ‌నుకోండి. అత‌డి కోసం ఈ మ‌ద్య ప్రియాంక ముంబైలో ర‌హ‌స్యంగా ఓ పార్టిని కూడా ఏర్పాటు చేసింద‌ట‌.

లాస్ట్ వీక్ ఈ ఇద్దరూ ఏంచక్కా డేటింగ్ చేశార‌ని స‌మాచారం. మరి ఈ ఇద్దరి మ‌ద్య ప్రేమ ఎప్పుడు..ఎలా చిగురిందంటే..... .లాస్ట్ ఇయ‌ర్ ఓ మ్యూజిక్ ఫంక్షన్ కోసం ప్రియాంక అమెరికాలోని లాస్ ఏంజెలిస్ వెళ్లింద‌ట‌. అక్కడే ఈ హీరో పరిచ‌య‌మ‌య్యాడ‌ట‌. అప్పట్నించి ఈ ఇద్దరి మ‌ద్య ఫోన్ కాల్స్...ఆ కాల్స్ ప్రేమ‌కు దారి తీశాయ‌ని తెలుస్తోంది. మ‌రి గ‌తంలో ఓ ఇద్దరు ముగ్గుర్ని ప్రేమించి ఆ బందాల్ని ముణాళ్లు ముచ్చట‌గానే ముగించేసిన ఈ సుంద‌రి మ‌రి ఇత‌గాడితోనైనా పెళ్లీ పీట‌లెక్కుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: