ఈ మ‌ధ్య టీజ‌ర్ సంప్రదాయం మ‌రీ జోరెక్కువైంది. తమ అభిమాన హీరోని చూడ్డానికి సినిమా విడుద‌ల వ‌ర‌కూ ఆగ‌ట్లేదు. ఇది వర‌కు సినిమా విడుద‌ల‌కు ఓ ప‌ది ప‌దిహేను రోజుల ముందు ట్రైల‌ర్లు వ‌చ్చేవి. ఇప్పుడు సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే టీజ‌ర్లు హంగామా సృష్టిస్తున్నాయి. హీరో బిల్డ‌ప్ షాట్లు రెండు, ఒక పంచ్ డైలాగ్ ఉంటే.. ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. మ‌హేష్‌బాబు టీజ‌ర్లకూ ఇదే ప‌ద్ధ‌తి పాటించారు.

బిజినెస్‌మేన్‌లో... ముంబైని ఉచ్చ పోయించ‌డానికి వ‌చ్చా... అని కాస్త ఘాటుగా ప‌లికాడు. దూకుడులో అయితే.. మైండ్ లో ఫిక్స‌యితే బ్లైండ్‌గా దూసుకుపోతా అని చెప్పాడు. ఇవి రెండూ ఆ సినిమాల‌పై అంచ‌నాలు విప‌రీతంగా పెంచేశాయి. ఇప్పుడు మ‌హేష్ - సుకుమార్ సినిమా వ‌న్ నుంచి కూడా ఓ అదిరిపోయే డైలాగ్ ఆశించారు. కానీ మ‌హేష్ ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. కేవ‌లం 30 సెక‌న్లు మాత్ర‌మే సాగిన ఈ టీజ‌ర్‌లో మ‌స‌క మ‌స‌క వెలుతురులో క‌నీ క‌నిపించ‌నట్టు కనిపించాడు  ప్రిన్స్‌..!  దానికే ఫ్యాన్స్ సంతోష ప‌డిపోతున్నారు. ఇక బొమ్మ పూర్తిగా చూపిస్తే ఏమైపోతారో...?

మరింత సమాచారం తెలుసుకోండి: