పాత తెలుగు సినిమాలు చూసేవారికి ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎంతో ప్రతిభావంతుడైన నటుడు అతను. డాక్టర్ వృత్తి నుంచి నటనరంగంలోకి అరుదైన నటుడు అతను. నల్గొండ జిల్లా తుంగతుర్తి గ్రామానికి చెందిన మందడి ప్రభాకరరెడ్డి 1960 లో విడుదలయిన ‘చివరకు మిగిలేది’ సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. ప్రారంభంలో విలన్ పాత్రలతో ఆకట్టుకున్నా తరువాత కేరెక్టర్ పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించాడు. 30 సంవత్సరాల సినీ జీవితంలో 450 సినిమాల వరకూ నటించారు.

ప్రభాకర్ రెడ్డి నటుడుగానే కాకుండా కథారచయితగానూ రాణించారు. ‘పండంటి కాపురం’, ‘పచ్చని సంసారం’, ‘ధర్మాత్ముడు’, ‘గృహ ప్రవేశం’, ‘గాంధీ పుట్టిన దేశం’, ‘కార్తీక దీపం’, ‘నాకు స్వాతంత్ర్యం వచ్చింది’.. సినిమాలకు కథలను అందించారు. అంతేకాకుండా కృష్ణ హీరోగా నటించిన ‘ప్రతిభావంతుడు’, కృష్ణం రాజు హీరోగా వచ్చిన ‘ప్రచండ భారతం’ సినిమాలకు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం.

అలాగే ‘పండంటి కాపురం’ సినిమాతో జయసుధను, ‘నాకు స్వాతంత్ర్యం వచ్చింది’ సినిమాతో జయప్రదను సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత ప్రభాకర్ రెడ్డి కే దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: