రామ్‌చ‌ర‌ణ్ ఇప్పటి వ‌ర‌కూ న‌టించిన చిత్రాల‌కు భిన్నమైన చిత్రంగా కొర‌టాల శివ మూవీ ప్లానింగ్ జ‌రుగుతుంది. ముహ‌ర్తం అదిరింది కాని క‌థే ప్యామిలి డ్రామా అంటున్నారు. మిర్చి మూవీతో ప్యామిలి ఎమోష‌నల్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేసుకున్న కొర‌టాల శివ, ఈ మూవీను కూడ దాదాపు అదే విధంగా ప్లాన్ చేసుకున్నాడ‌ని స‌మాచారం.


రామ్‌చ‌ర‌ణ్ మూవీలో అతి పెద్ద తార‌గాణం ఉన్న మూవీ ఏది లేదు. హీరో,హీరోయిన్‌, ఒక‌టి రెండు స‌పోర్టింగ్ క్యారెక్టర్స్‌, మ‌ధ్యలో కామెడీ ట్రాక్‌. అంతే, రామ్‌చ‌ర‌ణ్ మూవీ సూప‌ర్ డూప‌ర్‌. మ‌రి బండ్లగ‌ణేష్-రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీకు దాదాపు 50 మంది ప్రముఖ‌ తారాగ‌ణంతో భారీగా ర‌డీ అవుతుంది.ఇంత మందితో ద‌ర్శకుడు కొర‌టాల శివ ఇంకేం ర‌డీ చేస్తాడు, ఖ‌చ్ఛితంగా అది ఓ ప్యామిలీ డ్రామానే అంటున్నారు టి టౌన్ వాల‌.

ఎన్టీఆర్‌కు దూకుడు లాంటి బ్లాక్‌బ‌స్టర్ కావాల‌ని ద‌ర్శకుడుపై ఒత్తిడి తెచ్చిన ఎన్టీఆర్ అండ్ బండ్లకు ద‌ర్శకుడు మ‌ళ్ళీ దూకుడు మూవీనే చూపించ వ‌ల‌సి వ‌చ్చింది. అలాగే కొర‌టాల శివ‌పై కూడ మిర్చి లాంటి స్టైలిష్ బ్లాక్‌బ‌స్టర్ కావాల‌ని, రామ్‌చ‌ర‌ణ్ అండ్ బండ్ల ఒత్తిడి తీసుకువ‌స్తే ఇంకేముంటుంది, క‌న్‌ప్యూజ‌న్‌లో మ‌రో మిర్చి ఖాయం అని సున్నితంగా జోకులు పేల్చుకుంటున్నారు మ‌న క్రిటిక్స్‌. ఏదైమైన త్వర‌లోనూ రామ్‌చ‌ర‌ణ్ ఓ ప్యామిలి క‌ష్టాల మూవీతో బిజి అవుతాడన్న మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: