బండ్ల గ‌ణేష్‌కీ, బ‌న్నీ ఫ్యాన్స్‌కీ ఓ తీపి క‌బురు. తెలుగు నాట‌... ఇద్ద‌ర‌మ్మాయిల‌తో తుస్సుమ‌న్నా - ఓవ‌ర్సీస్‌లో బాగానే ఆడేస్తోంది. ఈ సినిమా వ‌సూళ్లు జులాయిని దాటేశాయి. జులాయి తొలి రోజు ఓవ‌ర్సీస్‌లో రూ. 86 ల‌క్ష‌లు వ‌సూలు చేశాయ‌ట‌. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో రూ.88 ల‌క్ష‌లు జేజిక్కించుకొంది.

ఓవ‌ర్సీస్ వ‌సూళ్ల‌లో తొలి ప‌ది స్థానాల్లో ఈ సినిమా కూడా చేరింది. మ‌హేష్‌బాబు దూకుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ జోరు... మ‌రో రెండు రోజులు అలాగే కొన‌సాగే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే తొలి మూడు రోజులు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో టికెట్లు అడ్వాన్సుగా ఎప్పుడో అమ్ముడుపోయాయి. ఆ త‌ర‌వాత సంగ‌తేంట‌నేదే అంతులేని ప్ర‌శ్న‌.

మరింత సమాచారం తెలుసుకోండి: