ఇద్దర‌మ్మాయిల‌తో మూవీ రిలీజ్ హీరోకు పెద్దగా లాభించిందేమి లేదు. అలాగనీ పూరికు కొత్త క్రెడిట్ కూడ ఏమి ద‌క్కలేదు. అయితే ఇందులో ఫేం,నేమ్‌,క్రేజ్ అన్నింటిని కొల్లగొట్టింది ఒక్క అమ్మాయే. త‌నే కేథ‌రిన్ థెరిస్సా

కేథ‌రిన్ చూపించిన గ్లామ‌ర్‌కు ఇండ‌స్ట్రీ ఫిధా అయింది. అమ‌లాపాల్‌ను లైట్ తీసుకున్న ప్రేక్షకులు కేథ‌రిన్‌కు జై కొట్టేసారు. ఇద్దర‌మ్మాయిల‌తో మూవీ టాక్‌ను ప‌క్కన పెడితే కేథ‌రిన్ కేక అంటూ అటు ప్రేక్షకులు,ఇటు ఇండ‌స్ట్రీ పీపుల్స్ సూప‌ర్బ్ అంటున్నారు. త‌న‌పై ఉన్న మోజును మాటల్లో చెప్పుకుంటున్నారు.

ఇక నుండి రాబోయో ప్రతి మూవీల్లో కేథ‌రిన్‌ను తీసుకోవాల‌ని అటు ప్రొడ్యూజ‌ర్లు, ఇటు హీరోలు క‌చ్ఛీప్ వేసుకొని కూర్చున్నారు. దీంతో మ‌రో హాటీ బ్యూటీ ఇండ‌స్ట్రీ వ‌చ్చింద‌ని సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: