సినిమా అంటేనే మాయాజాలం. భారీ హంగులు, ఆర్భాటాలు చేస్తూ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించి రూపాయలు ఎరుకోవాలి. దీనికి ప్రస్తుతం ఉన్న పోటి వాతావరణంలో రకరకాల ట్రిక్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళి షూటింగ్స్ చేయడం, లక్షలు ఖర్చు పెట్టి బాలీవుడ్ పాప్ సింగెర్స్ చేత పాటలు పాడించడం, అవసరం ఉన్నా లేకపోయినా హీరోలకు ఖరీదైన కాస్ట్యూమ్స్ వేయడం, అసలు సిడిలు పెద్దగా అమ్ముడుకాకపోయినా ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ అంటూ హడావుడి చేయడం, ఫంక్షన్స్ అన్నీ చానల్స్ లో లైవ్ టెలికాస్ట్ అయ్యేలా చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిర్మాతలు తీస్తున్న హై బడ్జెట్ సినిమాలకు హైక్ క్రియేట్ చేయడానికి నానాపాట్లు పడుతూ ఉంటారు.

అయితే “ఇద్దరమ్మాయిలతో” సినిమా ప్రారంభం నుండి సినిమాకు హైక్ తీసుకురావడానికి నిర్మాత బండ్ల గణేష్ మరో కొత్త అడుగువేశారు. 40 లక్షలు విలువ చేసే డైమండ్ లైటర్ ను ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టకుండానే దర్శకుడు పూరి కి బహుమతిగా ఇచ్చారు. దీనితో టాలీవుడ్ ధర్శాకనిర్మాతలకే కాదు సాధారణ సినిమా అభిమానులకు కూడా మైండ్ బ్లాంక్ అయిపొయింది. ఎవరైనా తమ తీసిన సినిమా సూపర్ హిట్ అయినప్పుడు ఆ సినిమా దర్శకుడికి మంచి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. కాని సినిమా విడుదల కాకుండానే బండ్ల గణేష్ స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు.
ఇక ఎన్నో అంచనాలతో నిన్న విడుదల అయిన బన్నీ ఇద్దరమ్మాయిలతో సినిమా చూసిన తరువాత సాధారణ ప్రేక్షకులే కాదు బన్నీ వీరాభిమానులు కూడా ఏమి మాట్లాడాలో తెలియని స్థితిలో దర్శకుడు పూరి పెట్టేశాడు. ఈ సినిమాకు రాష్ట్రం యావత్తూ ఎక్కడా పోసిటివ్ టాక్ రాలేదు. ప్రస్తుతం ఏ పెద్ద సినిమాలు లేవు కాబట్టి సరిపొయింది కాని ఏ మంచి సినిమా అయిన ఈ సినిమా తో పోటి వచ్చి ఉంటే ఈ పాటికే థియేటర్స్ అన్నీ ఖాళి అయిపోయి ఉండేవని టాలీవుడ్ టాక్. సెలవలు సీజన్ వల్ల కొంతవరకు నయ౦ కాని లేకుంటే పూరి దెబ్బకు బండ్ల గణేష్ పరిస్థితి ఏమిటి అంటూ ఫిల్మ్ నగర్ లో మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎండాకాలం వేడి తగ్గిపోయినా డైమండ్ లైటర్ మంటల వేడిలో నిర్మాత బండ్ల గణేష్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కధ లేకుండా సినిమాలు తీస్తే ఇలాగే ఉంటుందని మన నిర్మాతలకు ఎప్పుడు తెలిసి వస్తుందో.....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: