ఇద్ధర‌మ్మాయిల‌తో మూవీ రిలీజ్ అయి క‌నీసం రెండు రోజులు కూడ కాలేదు. రిలీజ్ అయిన సాయంత్రానికే గుంటూరు మార్కెట్లో పైర‌సీ సిద్దమైంది. యాంటీ పైర‌సీ సెల్ జ‌రిపిన రైడ్‌లో 55 వేల పైర‌సీ డివిడిలు జ‌నాల్లోకి వెళ్ళడానికి ర‌డీగా ఉన్నాయి. ప‌క్కా స‌మాచారం అందుకున్న యాంటి సెట్ వెంట‌నే వెళ్ళి ఆ పైర‌సీ డివిడిల‌ను ప‌ట్టుకుంది. లేక‌పోతే గుంటూరు క‌లెక్షన్స్‌లో భారీగా తేడా క‌నిపించేది.

ఇంత పెద్దమొత్తంలో రిలీజ్ మూవీ పైరసి డివిడిల‌ను ప‌ట్టుబ‌డటంతో, ప్రొడ్యూజ‌ర్లకు వ‌ణుకు తెప్పిస్తుంది. నిజానికి పైర‌సి డివిడిలు ర‌డీ అయ్యాయంటే దాదాపు పైర‌సీ టోరంట్‌లు ర‌డీ అయిన‌ట్టే. షాపుల్లో దొరికే డివిడిల‌న‌యితే ప‌ట్టుకున్నారు గాని, ఇంట‌ర్నెట్‌లో దొరుకుతున్న పైర‌సి రిప్‌ల‌ను ఎలా అరిక‌ట్టాలో ఎవ‌రికి అంతు ప‌ట్టడంలేదు. ఈ రోజు ఉద‌యం నుండే ఇద్దర‌మ్మాయిల‌తో మూవీకు సంబంధించిన ఇంట‌ర్నెట్‌లోని డివిడి రిప్‌లు సిస్టమ్స్‌లోకి డౌన్‌లోడ్స్ జ‌రుగుతున్నాయి.

ఇద్దర‌మ్మాయిల‌తో మూవీ నెంబ‌ర్ ఒన్ క్వాలిటి పైర‌సీ ప్రింట్ మార్కెట్‌లో రావ‌డంతో యూనిట్ అంతా స్టన్ అయ్యారు. ఏం చేసేది లేక‌, దొరికినన్ని పైర‌సీ మూవీల‌ను ప‌ట్టుకొని క‌నీసం వాటినైన మార్కెట్‌లోకి రాకుండా అడ్డుకున్నందుకు ప్రొడ్యూజ‌ర్‌ సంతోష‌ప‌డుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: