రూల‌ర్ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 3న షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. కానీ ఒక‌టే స‌మ‌స్య‌. బాల‌య్య ప‌క్క‌న న‌టించే క‌థానాయిక‌లు ఎవ‌ర‌ని?? ఈ సినిమాలో బాలకృష్ణ స‌ర‌స‌ర ఇద్ద‌రు క‌థానాయిక‌లు కావాలి. వారి ఎంపిక ఎంత‌కీ తేల‌డం లేదు. అసిన్‌, న‌య‌న‌తార పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. కానీ... ఫైన‌లేజ్ కాలేదు. ఈ సినిమాలో న‌య‌న‌తార న‌టించే అవ‌కాశ‌మే లేద‌ని... బోయ‌పాటి శ్రీ‌ను చెబుతున్నారు.

ఇప్ప‌టికే ప‌లు పేర్లు బాల‌య్య ముందుకు వెళ్లాయి. అయితే బాల‌య్య ఇంకా డిసైడ్ చేయ‌లేదు. బాలీవుడ్ భామ‌లైతే బెట‌ర్ అనే ఉద్దేశానికి చిత్ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడూ వ‌చ్చేశారు. మ‌రి బాల‌కృష్ణ ఏమంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: