ల‌వ్ ఫెయిల్యూర్ లాంటి ఓ మాదిరి సినిమా త‌ప్ప - ఐదేళ్లుగా హిట్ మొహం ఎరుగ‌ని హీరో సిద్దార్థ్‌. జ‌బ‌ర్ ద‌స్త్‌... అట్ట‌ర్ ప్లాప్ అయ్యి... సిద్దూ కెరీర్‌ని తుంగ‌లో తొక్కేసింది. ఇప్పుడు మ‌రో సినిమాతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. అదే... స‌మ్‌థింగ్ - స‌మ్‌థింగ్‌. సిద్దార్థ్‌, హ‌న్సిక జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. సుంద‌ర్ సి దర్శ‌కుడు. ఈనెల 14న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు.

ఈసారి ప్ర‌యోగాల జోలికి పోకుండా క్లీన్ కామెడీ సినిమాని ఎంచుకొన్నాడ‌ట సిద్దూ. బ్ర‌హ్మీతో క‌లిసి కామెడీ కుమ్మేశాడ‌ట‌. అంతేకాదు.. స‌మంత‌, రానా ఈ సినిమాలో అతిథి పాత్ర‌ల్లో త‌ళుక్కున మెర‌వ‌నున్నారు. దానికితోడు హ‌న్సిక అందాలు, బ్ర‌హ్మానందం కామెడీ ఉండ‌నే ఉంది. ఇవ‌న్నీ క‌లిసి త‌న సినిమాని గ‌ట్టెక్కిస్తాయ‌ని సిద్దూ న‌మ్ముతున్నాడు. ఇది త‌మిళ సినిమా అయినా.. తెలుగులో తీశామంటూ బిల్డ‌ప్పులు ఇస్తున్నారు నిర్మాత‌లు. ఏదేమైనా సిద్దూకి ఇది డూ ఆర్ డై సినిమా అన‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: