నితిన్‌.... ప‌వ‌న్ కల్యాణ్‌కి పిచ్చ ఫ్యాన్ అనే సంగ‌తి తెలిసిందే. ఇష్క్ ఆడియో వేడుక‌కు వ‌చ్చి.. నితిన్ జాత‌కాన్నే మార్చేశాడు. గుండెజారి గ‌ల్లంతయ్యిందే ఆడియోకి రాక‌పోయినా... దీవెన‌లు పంపాడు. అలాంటి ప‌వ‌న్‌... చెబితే నితిన్ కాదంటాడా?  ఎగిరి గంతేస్తూ ఒప్పేసుకోడూ. ఇంత‌కీ ప‌వ‌న్ ఏం చేశాడంటారా?  అక్క‌డికే వ‌స్తున్నాం. నితిన్ - క‌రుణాక‌ర‌న్ క‌ల‌యిక‌లో ఓ సినిమా వ‌స్తోంది క‌దా. దాన్ని శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమాలో క‌రుణాక‌ర‌న్ ఎంట్రీ ఇవ్వ‌డానికి కార‌ణం... ప‌వ‌న్ దీవెన‌లే న‌ట‌. `క‌రుణాక‌ర‌న్‌ని ఓ ఛాన్స్ ఇవ్వు..`అని  స్వ‌యంగా ప‌వ‌న్ ఆదేశించాడట‌. దాంతో నితిన్ కూడా ఓకే చెప్పేశాడు. క‌రుణాక‌ర‌న్‌కి ఆఫ‌ర్ రావ‌డం వెనుక ఇంత క‌థుంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: