రానా బాలీవుడ్‌లో మ‌రోసారి మెరుస్తున్నాడ‌హో.. అని హ‌డావుడి చేసిన సినిమా... ఏ జ‌వానీ హై దివానీ. ఈ సినిమా ఈ శుక్రవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇంత‌కీ ఈ సినిమాలో రానా క‌నిపించింది ఎంత సేపో తెలుసా..?  ఒకే ఒక్క మిమిషం. అందులోనూ మాట‌ల్లేవు. ఇంత ప్రాధాన్యం లేని పాత్ర‌ని ఎందుకు ఒప్పుకొన్నాడో మ‌రి. అయితే ఈ అతిథి పాత్ర వెనుక ఓ లాజిక్ ఉంది.

ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం డి.సురేష్‌బాబు విశ్వ ప్ర‌య‌త్నాలూ చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో రానాతో తెర‌కెక్కించాల‌ని ఆయ‌న కోరిక‌. అందుకే ముందు జాగ్ర‌త్త కోసం... రానా ఈ సినిమాలో అతిథి పాత్ర అడిగిన వెంట‌నే ఒప్పుకొన్నాడు. దాదాపు ఈ సినిమా రైట్స్ డి.సురేష్ బాబు చేతికి చిక్కిన‌ట్టే. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?  అనేది తేలాల్సివుంది. అన్న‌ట్టు... ఏ జ‌వానీ, హై దివానీ సినిమాకి బాలీవుడ్‌లో అప్పుడే హిట్ టాక్ వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: