ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాకి వెళ్లిన వారికి... ఓ బోన‌స్ ద‌క్కింది. ఇంట్రవెల్‌లో... ర‌వితేజ బ‌లుపు ట్రైల‌ర్ చూపించారు. అది కాస్త హ‌డావుడిగానే క‌నిపించినా... ర‌వితేజ పాత సినిమాల ట్రైల‌ర్‌ల‌న్నీ క‌ట్ చేసి చూపిస్తున్న‌ట్టు అనిపిస్తోంది. ట్రైల‌రే అలా ఉంటే.. ఇక సినిమా ప‌రిస్థితి ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ సినిమా మార్కెట్ ఇంకా మొద‌లు కాలేదు. పాట‌లు చూసైనా - బ‌య్య‌ర్లు వ‌స్తార‌నుకొంటే.. మ్యూజికాయ‌న త‌మ‌న్ ఆయే. ఆయ‌న సంగీతం అంటే కొత్త పాట‌లూ, అదిరిపోయే బీట్లూ ఎక్క‌డి నుంచి వ‌స్తాయి?  ఇక ఈ సినిమాని బ్ర‌హ్మీ కామెడీ, శ్రుతిహాస‌న్ ఎక్స్‌పోజింగూ, దీక్షాసేథ్ ఐటెమ్ పాటే కాపాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: