రవితేజ హీరోగా, శృతిహాసన్, అంజలి హీరోయిన్ గా గోపిచంద్ మల్లినేన్ దర్శకత్వంలో వస్థున్న బలుపు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంగరంగవైభవంగా మొదలయింది.

7:40pm: దర్శకుడు గోపిచంద్ ఫంక్షన్ హాలులోకి వచ్చారు. సినిమాలోని ‘ అమ్మదారిలో ’ అన్న పాటను డ్యాన్స్ బృందం ప్రదర్శించింది.
7:50pm: యోగి లేజర్ గ్రూప్ ప్రదర్శించిన బలుపు సినిమాలోని ‘అందమైన అమ్మాయిలు’ పాట ఫంక్షన్ ను అదరగొట్టింది.
7:55pm: రవితేజకు ఒళ్లంతా బలుపే, అందుకే ఆయనదంతా గెలుపే అంటూ యాంకర్ శ్రీనివాస్ రెడ్డి అనడంతో ప్రాంగణంలో చప్పట్లు వెల్లివిరిసాయి. శ్రీజా డ్యాన్స్ గ్రూప్ ‘ చూపుల్థో గుచ్చి గుచ్చి చంపకే.... సిలకేమో సీకాకుళం, చెన్నై చందమా, అంటూ రవితేజ పాటలతో హంగామా చేసారు.
8:00pm: సన్నితో పాటు డ్యాన్సర్  విక్రమార్కుడు సినిమాలోని సన్యాసి వేషం లో చేసిన రవితేజ వలే చేసిన ప్రదర్శన, ‘కాలేజి పాపలు..’ అనే పాటపై చేసిన డ్యాన్స్ ప్రేక్షులను ఉర్రూతలూగించింది. ఎర్రకోక... పాటను ప్రదర్శించారు.
8:05: ‘బలుపు’ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని భార్య శ్రీ సత్య వేడుకకు ప్రదాన ఆకర్షణ గా నిలిచారు.
8:10: తెలుగు సినిమా చరిత్ర పై ప్రదర్శిస్తున్న  ఎవి ఆకట్టుకుంటుంది. 
8:20: పాతళభైరవి, ఠాగూర్, మగధీర, ఈగ వంటి తెలుగు సినిమాల బిట్లు చూపిస్తూ సాగిన ఈ ఎవి ఈ కార్యక్రమంలో ఒక హైలెట్ అని చెప్పుకోవాలి.
8:21: బలుపు సినిమాలో ‘ఏమైందీ..’ పాటను నిర్మాతలు కె.ఎస్.రామారావు, కళ్యాణ్ రామ్ విడుదల చేశారు.
     
8:30:
సమ, శ్రీనివాసరెడ్డి ల యాకరింగ్ నవ్వులు పంచుతూ సాగుతుంది.
8:31: ‘మేకింగ్ ఆఫ్ బలుపు’ ఎవిని ప్రదర్శిస్తున్నారు.
8:35: నిర్మాత కె.ఎల్ నారాయణ - డివివిదానయ్య బలుపు సినిమాలోని ‘పాతికేళ్ల చిన్నది’ పాటను విడుదల చేశారు.
   
8:45: దాసరి నారాయణరావు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
8:30: సమ, శ్రీనివాసరెడ్డి ల యాకరింగ్ సరదాగా సాగుతుంది.
9:00: ‘బలుపు’ సినిమా హీరోయిన్ శృతిహసన్ వేడుకకు హజరయ్యింది. బ్లాక్ డ్రెస్ లో శృతి అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది.
9:05: దర్శకురాలు నందినిరెడ్డి, నటుడు అజయ్ కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు.
9:10: బలుపు సినిమా విలన్ అశతోష్ రానా, నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
9:15: బలుపు ట్రైలర్ ను దాసరి నారాయణ రావు ఆవిష్కరించారు.
9:16: బలుపు ట్రైలర్ చూసి ఆనందించండి
    
9:20 దాసరి నారాయణరావు మాటలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పివిపి సంస్థ గురించి, రవితేజ గురించి గొప్పగా చెబుతున్నారు.
9:30: ‘పడిపోయాని ఇలా..’ పాటను ఎన్.వి.ప్రసాద్ , బివిఎన్ ఎస్ ప్రసాద్ ఆవిష్కరించారు.
9:30: పడిపోయాని ఇలా..’ పాటను ఆస్వాదించండి.

9:40: హీరోయిన్ అంజలి వేడుకకు విచ్చేసింది. బ్లూ డ్రెస్ లో అదిరిపోయింది.
9:45: స్రవంతి రవికిషోర్, జెమిని కిరణ్ ‘లక్కీ లక్కీ రాయ్’ అనే పాటను విడుదల చేశారు.
9:50: నిర్మాత బండ్లగణేష్, నటుడు ఆశతోష్ రానాలు ‘కాజలు చెల్లిలివా..’ అనే పాటను విడుదల చేశారు.
9:51 : కాజలు చెల్లిలివా పాటను వినండి.

10:00: అందరి కోసం వేదికపై రవితేజ ‘హల్లో బాయ్స్ గర్స్..’ పాటను అలపించాడు. తమన్, శృతిహసన్ కూడా అతనితో పదం కదిపారు.
10: 10: పివిపి చేతుల మీదుగా బలుపు ఆడియో సిడిని ఆవిష్కరించారు.
10:15: ఆహ్లదకర వాతావరణంలో జరిగిన బలుపు ఆడియో విడుదల కార్యక్రమం ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: