అందాల తార, టాలీవుడ్ హట్ బ్యూటీ సమంత ఈ ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకోనుంది. ఈ విషయాన్ని సమంత ప్రియుడు, హీరో సిద్ధార్థ తెలిపాడు. గత కొంత కాలంగా సిద్దార్థ-సమంతల మధ్య ప్రేమాయణం సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే కథనాలు కూడా వెలువడ్డాయి. వీటిని హీరో సిద్దార్థ ఖరారు చేశాడు. తాము ఇద్దరు ప్రేమించుకుంటున్నామని, పెద్దల అనుమతితో ఈ ఏడాది డిసెంబర్ లో విహాహం చేసుకుంటున్నట్లు తెలిపాడు.

చెన్నై కు చెందిన సమంత ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. బృందావనం, ఈగ, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ... వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారింది.

కాగా, తమిళ నాడు కే చెందిన సిద్దార్థ   ‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘ఆట’... వంటి సినిమాలతో తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి వారికి దగ్గర అయ్యాడు. బాలీవుడ్ లో తన సత్తా చూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: