ఒక హీరోయిన్ ఎప్పుడూ వార్తల్లో వుంటుదంటే.....వ‌రుస ఆఫ‌ర్లు...వ‌రుస విజ‌యాలు...., ఎఫైర్స్.... రెమ్యూన‌రేష‌న్ ఎట్సెట్రా ఎట్సెట్రా రీజ‌న్స్ వుంటాయి. నిజానికి ఇవి కూడా ఒక హీరోయిన్ న్యూస్ లో వుండ‌టానికి, టాప్ హీరోయిన్ అన‌డానికి కొల‌మానాలే అనుకోండి. . కానీ ఏ హీరోయిన్ అయినా సంతోషంతో క‌న్నీరు కార్చిందంటే.....ఈ క్షణం నా జీవితంలో మ‌రిచిపోలేను అన్నది అంటే అది నిజ‌మైన‌ స‌క్సెస్ కి సింబ‌ల్. ఇపుడు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా అలాంటి ఆనందాన్నే...అలాంటి స‌క్సెస్ నే ఎంజాయ్ చేస్తోంది.
ఫ్యాష‌న్ సినిమాతో ఉత్తమ న‌టిగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్న ఈ బ్యూటీ ఇపుడు మ‌రో అరుదైన గౌర‌వాన్ని అందుకుంది. అదేంటంటే ప్రియాంక జీవితం ఇపుడు పాఠ్యపుస్తకంలో ఎక్కింది. సి.బి.ఎస్.సి కి అనుబంధ‌మైన స్ర్పీంగ్ డేల్స్ స్కూల్ పాఠ్య పుస్తకంలో ఈ సుంద‌రి గురించి ఓ పాఠం పెట్టేశారు.

ఈ పాఠంలో ప్రియాంక విజ‌య‌గాధ‌ని, సైనిక నేప‌ద్యాన్ని చేర్చారు. సో ప్రియాంక స‌క్సెస్ చిల్ర్డ్రన్స్ కి సూర్తిదాయ‌కం అవుతుంద‌న్నమాట‌. నిజానికి పిల్లల‌కు స్పూర్తినిచ్చే స్ధాయి గుర్తింపు అంటే మాట‌లా....? అందుకే ప్రియాంక‌ను బాలీవుడ్ హీరోయిన్స్ సైతం అభినందించ‌కుండా వుండ‌లేక‌పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: