స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ పుల్ డైరెక్టర్ కాంబోలో వ‌చ్చిన ఇద్దర‌మ్మాయిల‌తో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్సే రాబ‌ట్టింది. ట్రైల‌ర్ బాగుండ‌టం.....టాపె లేచిపోద్ది, వ‌యోలిన్ సాంగ్స్ మ్యూజిక్ ల‌వ‌ర్స్ కి ఓ రేంజ్ లో ఎక్కేయ‌డంతో ఫ‌స్ట్ డే ధియేట‌ర్లకు జ‌నాలు బాగానే వ‌చ్చిన‌ట్టు అర్దమ‌వుతోంది.

వాల్డ్ వైడ్ ఈ సినిమా ఫ‌స్ట్ డే 12 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ని అల్లు శిరిష్ ట్వీట్ చేశాడు. మ‌న ఆంద్రప్రదేశ్ లోనే 10.5 కోట్ల రూపాయ‌లు వసూలు చేసింద‌ట‌. ఇది బ‌న్నీ కెరీర్ లో ఓ రికార్డ్ అని కూడా శిరిష్ ట్విట్ లో తెలిపాడు.

ఇక శిరిష్ చెప్పిన షేర్ లెక్కలు క్లారిటీగా చూస్తే ఆంద్రప్రదేశ్ 10.5(నైజాం 7.5, సీడెడ్ 1.43కోట్లు, ఆంద్ర 3.35కోట్లు, క‌ర్ణాట‌క‌లో 1.05కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్టు తెలిపాడు. అంతేకాదు సినిమా విజ‌యానికి పూరి టేకింగ్ , బ‌న్నీ యాక్షన్ మెయిన్ ఎస్సెట్ అయ్యామ‌ని మూవీ యూనిట్ మొత్తానికి నా కంగ్రాట్స్ అంటూ ట్వీట్స్ పోస్ట్ చేశాడు శిరిష్. అయితే తొలి రోజు క‌లెక్షన్స్ బాగానే వున్నా.....సెకండ్ డే నుండి ఈ సినిమాను చూసే నాధుడు లేక ధియేట‌ర్లు వెల‌వెల‌బోతున్నాయని సినీ ఫాలోయ‌ర్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: