జ‌న‌ర‌ల్ గా హీరోయిన్స్ తెర‌పై అందంగా క‌నిపించ‌డానికి ట్రై చేస్తూ వుంటారు.ఒక వేళ హీరోయిన్ క‌ల‌ర్ బ్లాక్ అయినా ఓ ప‌ది ఫౌడ‌ర్ డ‌బ్బాలు మోహంపై అద్దుకోని తెల్లగా క‌నిపించి యూత్ ని క‌వ్విస్తారు. కానీ క‌త్తిలాంటి బ్యూటీ క‌త్రినాకైఫ్ మాత్రం న‌ల్లగా క‌నిపించాల‌ని అంటోంది. అన‌డ‌మే కాదు తెల్లగా మిల‌మిల మెరిసిపోయే మేనిని న‌ల్లగా మార్చేందుకు ప్రయ‌త్నిం కూడా మొద‌లెట్టింది.
అందులో బాగంగా వైట్ బాడికి బ్లాక్ షేడ్ తెచ్చేందుకు చాలా మార్గాల్లో ట్రై చేసింద‌ట‌. అయితే అవేవీ వ‌ర్క్ ఔట్ అవ్వక‌పోవ‌డంతో చివ‌రికీ ధాయ్ లాండ్ బీచ్ ని న‌మ్ముకుంద‌ట‌. అక్కడ ఎండ కుమ్మేసే టైంలో బీచ్ లో బికినీతో ప‌డుకుంద‌ట‌. అంతే క‌త్తిలాంటి బ్యూటీ బాడీ క‌మిలిపో్యి రంగు మారింద‌ట‌.

అమ్మాయిలంతా తెల్లగా అవ్వడానికి బ్యూటీ పార్లల చుట్టూ తిరుగుతుంటే.....మ‌రి న‌ల్లగా మారేందుకు బీచ్ కి వెళ్లాల్సిన ఆగ‌త్యం ఏమోచ్చింది క‌త్రినాకు అని మీ డౌటు క‌దా...ఓకే ఆ పాయింట్ కే వ‌స్తున్నా. ప్రస్తుతం క‌త్రినా అమీర్ ఖాన్ దూం3తో పాటు బ్యాంగ్ బ్యాంగ్ అనే మ‌రో యాక్షన్ సినిమా కూడా చేస్తోందండి.

ఈ రెండు సినిమాల్లోనూ క‌త్రినా త‌న అందాల‌తో క‌వ్వించ‌డం కంటే క‌త్తిప‌ట్టి చేసే వీరోచిత విన్యాసాలే ఎక్కువ‌ట‌. దీంతో రెండు సినిమాల్లోనూ ఒకే క‌ల‌ర్ లో క‌నిపించి ఫైట్స్ చేస్తుంటే డిఫ‌రెన్స్ ఏమీ వుండ‌ద‌ని, దూమ్3లో తెల్లగా, బ్యాంగ్ బ్యాంగ్ లో న‌ల్లగా వుంటే ఆడియెన్స్ ధ్రిల్ గా ఫీల‌వుతారని క‌త్రినా ఫీలింగ‌ట‌. పాత్ర కోసం క‌త్రినా ప‌డుతున్న తాప‌త్రయం బాగానే వుందిగానీ క‌త్తిలాంటి అందాలు వెండితెర‌పై న‌ల్లగా అగుపిస్తే ఆడియెన్స్ చూడ‌గ‌ల‌రా....?ఏమో సినిమా వ‌స్తేగానీ తెలీదుక‌దా..?

మరింత సమాచారం తెలుసుకోండి: