నాకు నేనే పోటీ అనే స్థాయికి మహేష్ ఎదిగిపోయాడు. అందుకే ధైర్యంగా తన కొత్త సినిమాకు ‘1’ అనే టైటిల్ నిర్ణయించి తన సహనటులకు తోడ కొడుతున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం నాదే అంటూ తన చేతలతో సవాల్ విసురుతున్నాడు. మహేష్ ఆత్మ స్థైర్యాన్ని గమనిస్తున్న విమర్శకులు మాత్రం మహేష్ కు పోటీ ఇవ్వగల హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో లేరా అనే చర్చను లేవనెత్తుతున్నారు. వారి అభిప్రాయంలో ఎప్పటికైనా ప్రిన్స్ స్థానాన్ని ఆక్రమించగల శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ కే ఉంటుంది అంటున్నారు. దీనికి కారణం ఫ్లాపులు సక్సెస్ లతో సంబంధం లేకుండా పవన్ కు ఉన్న మాస్ ఇమేజ్. కానీ పవన్ కు మహేష్ లా సినిమాలు ఉన్నా లేకపోయినా జనం మధ్య పాప్ లారిటీ పెంచే బ్రాండ్ ఎడ్వటైజ్ మెంట్స్ లేవు.

అదీకాకుండా పవన్ అంత అందగాడు కాదు, నేషన్ వైడ్ లో మోస్ట్ డిజైర్ బుల్ పర్సన్ కాదు. అదేవిధంగా రామ్ చరణ్ మహేష్ స్థానానికి సమీపంగా వస్తాడా అనుకుంటే చెర్రీ కి సినిమాల వల్ల మాస్ ఇమేజ్ వస్తోంది కానీ ఓవర్సీస్ ప్రేక్షకులు అమ్మాయిలలో మాత్రం రామ్ చరణ్ కు ఇంకా మంచి క్రేజ్ ఏర్పడలేదు, చెర్రీ కి కూడా రోజు టివీ లలో ప్రత్యక్షమయ్యే పెద్దపెద్ద కంపినీల యాడ్స్ లేవు. ఇక ఎన్టీర్ ని తీసుకుంటే యంగ్ టైగర్ కు ఒక హిట్ వస్తే మూడు ఫ్లాపులు వస్తాయి ఎన్టీర్ కు కూడా నేషనల్ వైడ్ లో ఇమేజ్ లేదు, ఇక అమ్మాయిల విషయంలో సరేసరి.

 విమర్శకుల దృష్టిలో ఎప్పటికైనా మహేష్ స్థానాన్ని అందుకోగల ఏకైక క్రేజీ స్టార్ ఆరడుగుల అందగాడు ప్రభాస్ అంటున్నారు. ఈ మధ్యనే సూపర్ హిట్ అయిన ‘మిర్చి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ అమ్మాయిలలో విపరీతంగా పెరిగిపోయింది. అనుకోకుండా వచ్చిన రాజమౌళి ‘బాహుబలి’ అదృష్టం ప్రభాస్ ను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మార్చేసింది. రాబోయే రెండేళ్ళలో మహేష్ కొత్త సినిమాల విజయం – ప్రభాస్ ‘బాహుబలి’ విజయం బట్టీ టాలీవుడ్ నెంబర్ వన్ ఎవరు అన్నది తేలిపోతుందని విశ్లేషకుల అభిప్రాయం. కానీ ప్రిన్స్ మాత్రం ఇది ఏమి పట్టించుకోకుండా తన సినిమాకు ‘1’ టైటిల్ నిర్ణయించుకుని తోటి హీరోలకు తోడ కొడుతున్నాడు..... 

మరింత సమాచారం తెలుసుకోండి: