ఇటీవల వచ్చిన ‘బాద్ షా’, ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాల బాటలోనే ‘అత్తారింటికి దారేది..!!’ సినిమా ప్రయాణిస్తుంది. ‘బాద్ షా’, ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలను స్పెయిన్ లో షూటింగ్ జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ‘అత్తారింటికి దారేది..’ సినిమా షూటింగ్ ను కూడా అక్కడ నిర్వహించనున్నారు.

హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ ల కలయికలో ‘అత్తారింటికి దారేది’ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగును ఈ నెల ఐదు నుంచి స్పెయిన్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ షూటింగులో పవన్ కల్యాణ్, సమంతా పాల్గొంటారు. ఇందుకోసం చిత్ర యూనిట్ త్వరలోనే స్పెయిన్ బయలుదేరి వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: