రాజేంద్రప్రసాద్ ప్రసాద్ తరువాత తెలుగు హాస్య సినిమాకు కేరాఫ్ అడ్రస్సుగా ఉన్నాడు అల్లరినరేష్. 11 ఏళ్లుగా తెలుగు ప్రేక్షలను నవ్విస్తూ నేటి అధునాతన సాంకేతిక విప్లవం వల్ల సెల్ ఫోన్స్ లోనూ, కంపూటర్ల లోనూ రూపాయికి ఒక జోక్ అందుబాటలోకి వస్తున్న నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఒక హాస్య సినిమా చేసి, ఆ సినిమా ప్రదర్శింపబడుతున్న ధీయేటర్లకు జనం వచ్చేలా చేయడం కత్తి మీద సాము లాంటిది.

భారతదేశ సినిమా చరిత్రలో ఒక హాస్య సినిమాను త్రీడీ ఫార్మేట్ లో నిర్మించడం ఆ సినిమాలో హీరోగా నటించడం నరేష్ కే చెల్లింది. రెండున్నర గంటల సినిమాలో కనీసం నిమిషానికి ఒక్కసారైనా నవ్వించగలిగితే తన జీవితం ధన్యం అంటాడు ఈ అల్లరోడు. సంవత్సరానికి రెండు సినిమాలు హీరోగా చేయడం కష్టమైపోతున్న ఈ రోజులలో ఈ పదకుండు సంవత్సరాలలో తన 50వ సినిమాకు దగ్గరగా రావడం అల్లరి నరేష్ రికార్డు.

నవ్వించడమే కాదు గుండెలు బరువేక్కీలా తాను నాటించ గలనని నరేష్ ‘గమ్యం’, శంభో శివ శంభో’, ‘నేను’ సినిమాల ద్వారా నిరూపించాడు. ప్రస్తుతానికి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ అల్లరోడు త్వరలో తన కుటుంబ సభ్యులు మెచ్చిన అమ్మాయికి తాళి కడతానని చెపుతున్నాడు. ఈ అల్లరోడు ఇంక ఎటువంటి సెన్సేషన్ సినిమాలు చేస్తాడో చూద్దాం....

 

మరింత సమాచారం తెలుసుకోండి: